Meena: సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి.. కానీ?

Meena: ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన స్టైల్‌లో సినిమాలు చేసి.. తన అంద చందాలతో కుర్రాళ్ళకు నిద్ర పట్టనీకుండా చేసిన హీరోయిన్ మీనా. అప్పట్లో ఆమె స్టార్ హీరోలందరితో నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే జులై 12, 2009లో విద్యాసాగర్‌ అనే ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి నైనికా అనే కుమార్తె కూడా ఉంది. ఆయన ఈ ఏడాది జూన్ 29వ తేదీన కన్నుమూశారు. అతను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారు. లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని భావించారు. అయితే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి దొరకకపోవడంతో ఆయన ఆపరేషన్ జరగక హఠాత్తుగా చనిపోయారు.

ఆయన చనిపోయిన తర్వాత కొన్ని నెలలపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టిపెట్టింది. అయితే కూతురు ఇప్పటికీ డాడీ డాడీ అంటూ నిద్రలో ఏడుస్తూనే ఉందట. ఈ క్రమంలోనే మీనాను రెండో పెళ్లి చేసుకోమంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ససేమిరా అనిందట. తాజాగా కూతురు బాధను చూడలేక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తిని ఆమె వివాహం చేసుకోబోతోందని సమాచారం.

ఆ అంకుల్‌నే..

విద్యాసాగర్ బ్రతికున్నప్పుడు కూడా ఆయన ఇంటికి వచ్చేవాడట. మీనా కూతురు అంకుల్ అంకుల్ అంటూ పిలిచేదట. ఈ క్రమంలోనే కూతురికి దగ్గరైన ఆయనని పెళ్లి చేసుకుని జీవితంలో ముందుకెళ్లాలని ఆమె నిర్ణయించుకుందట. ఏది ఏమైనా సరే మీనా తీసుకున్న నిర్ణయాని రైట్ అంటూ కొందరు చెబుతుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు.

 

కాగా, మీనా భర్త పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటినీ మీనా కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నానని, ఈ సమయంలో తన కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి అని వేడుకుంది మీనా. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి అంటూ ఆమె అభ్యర్థించింది. దయచేసి విద్యాసాగర్‌ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరింది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -