Mega Family: మెగా అమ్మాయిలకు కాపురాలు చేసే ఆలోచన లేదా.. అలా జరుగుతోందా?

Mega Family: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రశ్న మెగా ఫ్యామిలీలో మెగా ఆడపడుచులు కాపురాలు ఎందుకు నిలబడడం లేదు? ఇదే విషయం గురించి ప్రస్తుతం అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరు వారికి తోచిన విధంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. మెగా ఆడపడుచుల కాపురాలు నిలబడడం లేదు అంటే ఎక్కడ తేడా కొడుతోంది? ఇప్పటికే మెగా బ్రదర్స్ ముగ్గురు కుమార్తెల జీవితాలు అంత సవ్యంగా ఎందుకు ఉండటం లేదు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పెద్ద కుమార్తె అయిన సుస్మిత కి అప్పట్లో దివంగత హీరో ఉదయ్ కిరణ్ తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

కానీ కొన్ని కారణాలవల్ల అది పెళ్లి వరకు కూడా వెళ్లకుండానే వారి వివాహం క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త ల కుటుంబానికి చెందిన అబ్బాయితో సుస్మిత పెళ్లి జరిగింది. పెళ్లయిన తర్వాత ఐదారేళ్ల పాటు చెన్నైలో ఉన్న సుస్మిత ఆ తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చేసింది. ఆమె చిరంజీవి ఇంట్లోనే గత పదేళ్ళుగా ఉంటోంది. సుస్మితకు భర్తతో అంత సఖ్యత లేదన్న ప్రచారం కూడా బాగా నడిచింది. ఇప్పుడు అత్తారిల్లు వదిలేసి పుట్టింట్లోనే ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ కాలం గడుపుతున్న పరిస్థితి సుస్మితది. సుస్మిత ని నిర్మాతగా నిలబెట్టడం కోసం చిరంజీవి కూడా గట్టిగానే కష్టపడుతున్నారు.

 

ఇప్పటివరకు సుష్మిత తన భర్తతో కలిసి ఏనాడు కనిపించింది లేదు. ఇక రెండవ కూతురు శ్రీజ విషయానికి వస్తే.. ముందుగా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా కూడా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒక పాప పుట్టాక మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత ఇంట్లో పెద్దలు ఒప్పించ‌డంతో చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది. కళ్యాణ్ రామ్, శ్రీజ కి ఒక పాప పుట్టిన తర్వాత మళ్లీ మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ కూడా గత ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. ఇక వీరు కూడా త్వరలోనే విడిపోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

ఇప్పుడు నిహారిక పరిస్థితి కూడా అలాగే జరగబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. నిహారికకు.. తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు బాగా గ్యాప్ వచ్చేసిందని అందుకే చివరకు సోషల్ మీడియా ఖాతాలలో కూడా వీరిద్దరూ ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేసుకున్నారని.. వీరిద్దరూ కలిసి ఉండటం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. మెగా ఫ్యామిలీలో అమ్మాయిలు చేసుకున్న భర్తలకు అంతగా విలువ ఉండదని, కేవలం తాము మెగా ఫ్యామిలీ వారసురాళ్ళం అన్న ధీమా వాళ్ళలో బలంగా నాటుకుపోయిందన,వారు ఏం చెప్పినా.. చేసినా భర్త వినటం చూస్తూ ఉండటం తప్ప ప్రశ్నించకూడదని, ఆ ధోర‌ణితోనే ఆ ఫ్యామిలీ అమ్మాయిలు ఉంటున్నారని టాక్ అయితే బలంగా వచ్చేసింది. మ్యారేజ్ లైఫ్ విషయంలో తల్లిదండ్రులు సర్ది చెబుతున్న కూడా మెగా ఆడపడుచులు వినే పరిస్థితి నుంచి దాటిపోయారని చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా చూసుకోవటం ఈ అతిగారాబం వల్లే వీళ్ళు మంకు పట్టుకుపోయి చివరకు భర్తలను సైతం పూర్తిగా డామినేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది అంటూ చాలామంది నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఆ కామెంట్స్ తో ఏకీభవిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -