Chiranjeevi-Ram Charan: చరణ్ పై కోపంగా ఉన్న మెగాస్టార్.. కారణమిదే?

Chiranjeevi-Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. హీరోగా ఎవరూ అధిగమించలేనన్ని రికార్డులు మెగాస్టార్ నెలకొల్పారు. ఇప్పటికీ చాలా మందికి రోల్ మోడల్ గా, ఇండస్ట్రీకి వచ్చే వారికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పుడు చిరంజీవి సినిమాలంటే యమ క్రేజ్. ఇప్పటికీ ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

మెగాస్టార్ తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా ఇటు సినిమాలతో వచ్చిన క్రేజ్ తో అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. మెగా కుటుంబం నుంచి ఇంకా చాలా మంది హీరోలు వచ్చారు. వారిలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ, వైష్ణవ్ తదితరులు వచ్చారు.

అయితే, వీరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో భారీగా వెలిగిపోతున్నారు. మిగతా వారు యావరేజ్ హీరోలుగా ఉండిపోయారు. పవన్ కల్యాణ్ కూడా ఫ్యాన్స్ లో భారీ క్రేజ్ ఏర్పరచుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ గుర్తింపు పొందుతున్నారు. అయితే, ఓ విషయంలో చిరంజీవి చరణ్ పై అసంతృప్తిగా ఉన్నారట. అదే పిల్లల విషయం.

రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగి దాదాపు పదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా పిల్లల గురించి ప్లాన్ చేసుకోలేదు. దీనిపై చిరు అంత సంతృప్తిగా లేరని సమాచారం. తాజాగా చరణ్ ఫ్రెండ్, హీరో రానా కూడా తండ్రి కాబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ తో ఈ విషయం గురించి మెగాస్టార్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పిల్లల గురించి ప్లాన్ చేసుకోరా.. అని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చరణ్ ఇకనైనా పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -