Mahesh Babu-Meher Ramesh: మహేష్ కు ఫ్లాప్ ఇచ్చేవరకు మెహర్ రమేష్ నిద్రపోరా?

Mahesh Babu-Meher Ramesh: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఆడియెన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో సాటి హీరోలనే కాదు హీరోయిన్లను కూడా డామినేట్ చేస్తున్నారాయన. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కు మెస్మరైజ్ కాని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయం, ఫైట్లతో పాటు ఈ మధ్య డ్యాన్సులతోనూ మహేష్ రఫ్ఫాడిస్తున్నారు. అందుకే ఈతరంలోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతున్నారు.

 

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ నుంచి మరో మూవీ రాలేదు. క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త మూవీని సూపర్ స్టార్ ఆరంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ కు బ్రేకులు పడుతున్నాయి. ఇందులో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే కాలికి గాయమవ్వడంతో ఒకసారి చిత్రీకరణ ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్ తండ్రి కృష్ణ పరమపదించడంతో షూట్ మరోసారి నిలిచిపోయింది. మరికొద్ది రోజుల్లో ఎస్ఎస్ఎంబీ 28 చిత్రీకరణ తిరిగి మొదలవుతుందని సమాచారం.

 

త్రివిక్రమ్ సినిమాను త్వరగా పూర్తి చేసి ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే మూవీలో జాయిన్ అయ్యేందుకు మహేష్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక జక్కన్న మూవీ ఎలా ఉంటుందో ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల హింట్ ఇచ్చారు. మహేష్ ఇంటెన్స్ లుక్స్.. నటనలో ఆయన చూపించే తీవ్రత నచ్చే ఆయన్ను సెలెక్ట్ చేశామన్నారు. వచ్చే ఏడాది జూన్ లో ఈ మూవీ పట్టాలెక్కుతుందని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

ఆయనతో సినిమా అవసరమా?

కాగా, మహేష్ తో ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఓ మూవీ తీయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రమేష్ మాట్లాడుతూ.. త్వరలో మహేష్ తో తాను ఓ చిత్రం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మహేష్ కు ఫ్లాప్ ఇచ్చేవరకు మెహర్ రమేష్ ఊరుకోరా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయనతో సినిమా తీయడం అవసరమా అని మహేష్ ను ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి, మెహర్ రమేష్–మహేష్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -