Men: ఈ తప్పులు చేస్తే మాత్రం పురుషులు సంతోషంగా ఉండలేరా.. ఏం జరిగిందంటే?

Men: మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొన్నిసార్లు కొన్ని పద్ధతులను పాటిస్తే తప్ప జీవితంలో సంతోషం అనేది ఉండదు. ఒకప్పుడు పెద్దవారు కొన్ని పద్ధతులను ఎంతో నియమంగా పాటించేవారు అయితే ప్రస్తుత కాలంలో అలాంటి పద్ధతులకు ఆచారా వ్యవహారాలకు ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. అయితే జీవితంలో పురుషులు గౌరవ మర్యాదలను అందుకోవాలి అంటే కొన్ని తప్పులను మాత్రం అసలు చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే…

ఎప్పుడూ కూడా ఏ శుభకార్యానికి అయినా ఆహ్వానించకుండా పురుషులు అక్కడికి వెళ్ళకూడదు అలా వెళితే చాలా చులకనగా మారిపోతారు అలాగే మీకు ఎలాంటి గౌరవం కూడా ఉండదు. ఇక చాలామంది పురుషులు తమ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతే ఉంది అని చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా తమ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఇకఎవరితోనైనా గొడవపడి మీ స్నేహాన్ని వదులుకుంటే తిరిగి వారితో స్నేహం చేయడానికి ఎట్టి పరిస్థితులలోనూ బ్రతిమలాడకూడదు.

 

ఇక ఎవరితోనైనా గొడవ జరిగితే వారిని బహిరంగంగా దూషించవద్దు ఇలా చేయటం వల్ల శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇక పురుషుడు భార్యతో తప్ప ఇతర స్త్రీలతో ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు ఎల్లప్పుడూ తమ భార్య పిల్లలకు తల్లిదండ్రులకు రక్షణగా ఉండాలి. పురుషులు కూర్చున్నప్పుడు ఎవరితో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. మిమ్మల్ని ఎప్పుడూ అభిమానించే వారిని గౌరవించాలి. మీరు చేయని పనికి అనవసరంగా క్రెడిట్ ని తీసుకోవద్దు.

 

ఒకవేళ మీరు ఏదైనా ఒక టీం గా పనిచేసి గెలిచారు అంటే ఆ క్రెడిట్ మొత్తం మీరు మాత్రమే కాకుండా టీమ్ అందరికీ సమానంగా ఇవ్వాలి. ఇక పురుషులు ఎన్నో పనుల మీద బయటకు వెళ్తూ అలసిపోయి వస్తుంటారు. ఈ విషయాలన్నింటినీ ఇంటి వరకు తీసుకువచ్చి వారి పై కోప్పడకూడదు అదేవిధంగా ఎంత పనులలో బిజీగా ఉన్నా భార్య పిల్లలకు కొంత సమయం కేటాయించాలి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -