MLC Bharath: వలంటీర్లే వైసీపీ నేతలు.. వైరల్ అవుతున్న ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

MLC Bharath: ఏపీ రాజకీయాల మొత్తం ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి వాలంటీర్లు వైసిపి నేతలని భావించి వారు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ చెప్పింది అంతేకాకుండా ఈ రెండు నెలల పాటు ఏ విధమైనటువంటి విధులను కూడా నిర్వహించకూడదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ వైసీపీ నేతలలోనూ అలాగే వాలంటీర్లలో కూడా ఏమాత్రం మార్పు రాలేదని చెప్పాలి.

వాలంటీర్లుగా పని చేస్తున్నటువంటి వారందరూ కూడా వైసిపి నేతలేనని ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. ఇలా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇటు వాలంటీర్లకు అటు వైసిపి నేతలలో మార్పు లేదని తెలుస్తుంది.

ఎమ్మెల్సీ భరత్ వాలంటీర్లు అందరూ కూడా వైసిపి నాయకులేనని కుండబద్దలు కొట్టినట్టు నిజాన్ని వెల్లడించారు. ప్రస్తుతం వాలంటీర్లుగా పని చేస్తున్న వీరంతా వైసీపీ కార్యకర్తలే వీళ్లే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల సంచలనంగా మారాయి. ఒక కుప్పం మండలంలోనే సుమారు 354 మంది వాలంటీర్లు ఉండగా ఇందులో 326 మంది రాజీనామా చేశారని తెలిపారు.

ఇలా రాజీనామా చేసిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసమే కృషి చేస్తున్నారని తెలుస్తోంది. వాలంటీర్లే వైసీపీకి అండగా ఉంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో భరత్ తెర తొలగించి.. నిజం చెప్పేశారని అంటున్నారు. ఇలా భరత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతూ ఈయన వ్యాఖ్యలపై తప్పనిసరిగా ఈసీ చర్యలు తీసుకోవాలి అంటుంటే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -