MLC K Kavitha: టీఆర్‌ఎస్‌లో కవితకు తగ్గిన ప్రాధాన్యం.. అప్పటిలా ఇప్పుడు లేదే..

MLC K Kavitha: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో ఆమె చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఇంతకుముందులా యాక్టివ్ గా ఉండటం లేదు. గతంలో పార్టీలో ఏం కార్యక్రమం జరిగినా కవిత బాగా యాక్టివ్ గా పనిచేసేవారు. అన్నీ ముందు ఉండి నడిపించేవారు. పార్టీలోని నేతలందరితో కలిసిమెలిసి ఉండేవారు. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ లో కవిత మార్క్ కనిపించడం లేదు. కవిత జాడలు పార్టీలో ఇంతకుముందులా కనిపిండచడం లేదని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గత కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయంతో పాటు టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కవిత యాక్టివ్ గా కనిపించలేదు. గతంలో నిజామాబాద్ ఎంపీగా కవిత పనిచేశారు. కవిత అంటేనే నిజామాబాద్.. నిజామాబాద్ అంటేనే కవిత అనేలా రాజకీయాలు నడిపారు. ఆ జిల్లాలో ఏం జరిగినా కవిత కనుసన్నల్లోనే జరిగేది. అధికారంలో ఉండటంతో జిల్లా రాజకీయాలన్నీ ఆమె చెప్పినట్లే జరిగేవి. జిల్లా టీఆర్ఎస్ నేతలు కూడా ఆమె మాటను వినేవారు. ఆమె చెప్పినట్లే జిల్లా నేతలు చేసేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కవిత మార్క్ కనుమరుగైపోయింది. ఆమె క్రేజ్ జిల్లాలో బాగా తగ్గిపోయింది. ఆమె పాత్ర జిల్లా రాజకీయాల్లో అసలు కనిపించడం లేదని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉంటే కవిత అన్నీ చూసుకునేవారు. కానీ ఇటీవల కేసీఆర్ పర్యటన సమయంలో కవిత ప్రస్తావనే ఎక్కడా లేదు. సభ ఏర్పాట్లలో కూడా కవిత ప్రమేయం లేకుండానే పోయింది. కవితతో సంబంధం లేకుండానే స్థానిక టీఆర్ఎస్ నేతలు సభ ఏర్పాట్లు చూసుకున్నారు.

ఇక కలెక్టరేట్ ప్రారంభం సమయంలో కూడా కవిత కనిపించలేదు. కేవలం బహిరంగ సభకు వచ్చి సభ ముగియగానే వెళ్లిపోయారు. ఈ సభలో టీఆర్ఎస్ నేతలు కూడా కవిత పేరును తీసుకురాలేదంటే.. జిల్లా రాజకీయాల్లో ఆమె ప్రాధాన్యం ఎంత తగ్గిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన కవిత పేరును కనీసం ఒక్క నేత కూడా ప్రస్తావించలేదు. దీంతో టీఆర్ఎస్ లో కవిత మార్క్ మసకబారిపోయిందని ఆ పార్టీలో వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకప్పుడు జిల్లాగా పెద్ద దిక్కుగా ఉన్న కవితను ఇప్పుడు నేతలెవ్వరూ అసలు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నారు. నిజామాబాద్ బహిరంగ సభలో స్థానిక టీఆర్ఎస్ నేతలతో కూడా కవిత పెద్దగా మాట్లడలేదు.

దీంతో నిజామాబాద్ ను కవిత లైట్ తీసుకున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత.. పార్లమెంట్ లో తన స్పీచ్ లతో జాతీయ స్థాయిలో గుర్తింపు పట్టారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషపై కవితకు పట్టు ఉంది. పార్లమెంట్ లో తన వాగ్దాటితో ఎంపీగా పేరు సంపాదించుకుంటున్నారు. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కవిత కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కిన తర్వాత కాస్త యాక్టివ్ గా కనిపించినా.. ఇంతకుముందులా కవిత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.

ఇటీవల ఢిల్లీల లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు అన్ని అమెను టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించాయి. ఈ విషయంలో కవితపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కవితను మందలించినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ కార్యక్రమాల్లో కవిత యాక్టివ్ గా పాల్గొనడం లేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరికొంతమంది మాత్రం కావాలనే టీఆర్ఎస్ నేతలు కవితను సైడ్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -