Mobiles: బాత్రూమ్‌లో ఎక్కువ సేపు ఫోన్‌ పట్టుకుంటే ఆ వ్యాధులు వస్తాయట!

Mobiles: ప్రస్తుత కాలంలో ఫోన్‌ లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఫోన్లకు ఎంతగా బానిసలయ్యారంటే అది లేకుండా ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఒక మనిషికి ఎవరు ఉన్నా లేకపోయినా స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు అని భ్రమపడుతున్న రోజులివి. ప్రస్తుత కాలంలో ఫోన్‌కు ఎంతలా బానిస అయ్యామంటే ఫోన్‌ లేకుండా కొన్ని పనులను కూడా మనము చేసుకోలేనంత పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా పనుల్లో ఫోన్‌ సహాయం తీసుకుంటున్నాము. ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా.. ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలన్నా ఫోన్‌ ద్వారానే చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే పనులు ఫోన్‌ ల ద్వారా చక్కబడుతున్నాయి. అయితే ఫోన్‌ ద్వారా లాభాలతో పాటు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఒక ఫారిన్‌ యూనివర్సిటీ చేసిన సర్వే ప్రకారం స్మార్ట్‌ ఫోన్‌ లో 17 వేల బ్యాక్టీరియాలు ఉన్నట్లు చెప్పారు. అంతే కాకుండా మన ఇంట్లో ఉండే టాయిలెట్‌ సీట్‌ మీద ఉండే బ్యాక్టీరియా కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందట. అది కూడా టీనేజర్‌ లు వాడే ఫోన్‌ ల మీద ఎక్కువ బాక్టీరియా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం చాలా మంది యువకులు పొద్దున్న నిద్ర లేవగానే బాత్రూం లోకి ఫోన్‌ లను తీసుకెళుతున్నారట.
వెళ్లి వచ్చేస్తే పర్వాలేదు.. కానీ గంటలు గంటలు అక్కడే ఉండడం వలన బాత్రూం లో ఉండే బాక్టీరియా అంతా ఫోన్‌ మీదకు చేరుతోందట. వీరిలో అమెరికాకు చెందిన 75 శాతం మంది బాత్రూంకు ఫోన్‌ తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెబుతున్న ప్రకారం ఇలా బాత్రూం లోకి ఫోన్‌ తీసుకు వెళ్లడం వలన చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

 

బాత్రూంలో ఎక్కువ సేపు ఫోన్‌ పట్టుకుని కూర్చోవడంతో పెద్ద ప్రేగులో ఒత్తిడి పెరుగుతుందట. దీని ద్వారా మలద్వారం సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జీర్ణాశయ సమస్యలు కూడా ఉత్పన్న అవుతాయట. బాత్రూం లో ఫోన్‌ ను వాడడంతో సమయం వృథాతో పాటు అనుకున్న పనులు సమయానికి కాకుండా మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -