Mohan Babu: మోహన్ బాబు వార్నింగ్ ఆ నటుడికేనా.. టీడీపీపై విమర్శలు చేయడం వల్లే ఆయన స్పందించారా?

Mohan Babu: టీడీపీపై విమర్శలు చేయడానికి పోసాని కృష్ణ మురళీ కారణాలు వెతుక్కుంటారు. రాజకీయమా? సినిమా సంబంధించిన వ్యవహారమా? అనే దానికితో సంబంధం లేకుండా చంద్రబాబును ఎక్కడి అవకాశం దొరికితే అక్కడ విమర్శించడానికి ప్రయత్నిస్తారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా తీసుకొని రావడం చంద్రబాబు విఫలం అయ్యారని నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇదే విషయంపై చాలా టీవీ చానళ్ల డిబెట్‌లో హాజరయ్యారు. చంద్రబాబు విమర్శించడమే పనిగా పెట్టుకునేవారు. అప్పట్లో పోసానికి ఓ ఛానల్‌లో ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఉక్కిబిక్కిరి అయ్యారు.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో.. తమిళనాడులో జల్లికట్టు కోసం నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. జల్లికట్టు కోసం తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం రోడ్డు పైకి వచ్చింది. కానీ, ప్రత్యేకహోదా కోసం తెలుగు చిత్రపరిశ్రమ పోరాట చేయలేదు. అప్పుడు జల్లికట్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ దిగొచ్చింది. కానీ, ఏపీలో ప్రత్యేకహోదా హామీ మాత్రం నెరేవరలేదు. ఇదే విషయంపై ఓ ప్రముఖ ఛానల్ లో పోసానికి ఊహించని ప్రశ్న ఎదురైంది. హోదా విషయంలో చంద్రబాబును తప్పుపుడుతున్న మీరు సినిమా వాళ్లతో కలిసి ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. దానికి పోసాని దగ్గర సమాధానం లేదు. చంద్రబాబును అధికారంలో ఉంటే మేం ఎందుకు పోరాటం చేయాలని తప్పించుకున్నారు. అంతేకాదు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబును అడుగడుగునా ప్రశ్నిస్తూ వచ్చారు. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఆ తర్వాత ఇదే పోసాని వైఎస్ జగన్ ను ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా విషయంలో ప్రశ్నించలేదు. అంతేకాదు.. జగన్ ను సొంత కార్యకర్తలా వెనకేసుకొని వస్తున్నారు. నంది అవార్డుల విషయంలో.. విభజన హామీల విషయంలో ఇలాగే చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఓదశలో పవన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ను విమర్శించడంతో ఇండస్ట్రీలో చాలా మంది పోసానికి సినిమా అవకాశాలు కూడా ఇవ్వలేదు. అందుకే.. గతంలో వలే ఇప్పుడు పోసాని సినిమాల్లో పెద్దగా కనిపించడంలేదు. ఇవన్నీ పక్కన బెడితే… చంద్రబాబును తిట్టడానికి కారణాలు వెతుక్కొనే పోసాని హెరిటేజ్ విషయంలో బాబుపై విరుచుకుపట్టారు. హెరిటేజ్ మోహన్ బాబు స్థాపించిన సంస్థ అని.. దాన్ని చంద్రబాబు లాక్కొన్నారని మండిపడ్డారు. దానిపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ రాజకీయ అవసరాల కోసం తన పేరును వాడుతున్నారని మండిపడ్డారు. తన అనుమతి లేకుండా తన గురించి ప్రస్తావిస్తే చర్యలు తీసుకుంటానని మోహన్ బాబు.. పేరు చెప్పకుండానే పోసానికి వార్నింగ్ ఇచ్చారు.

“ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించు కుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ….. ధన్యవాదాలతో మంచు మోహన్ బాబు” అని ఓ నోట్ విడుదల చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -