Mohan Babu-Chiranjeevi: చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన మోహన్ బాబు.. ఆ సినిమా జాతకాన్ని మార్చిందా?

Mohan Babu-Chiranjeevi: ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న సినిమాని ఆ హీరోతో చేయలేక మరొకరితో చేయడం సర్వసాధారణం అయితే కొన్ని కారణాలవల్ల ఒక హీరోతో చేయాల్సిన సినిమాల్లోకి ఇతరులు బాగమవుతూ ఉంటారు. అయితే ఇలా మిస్ చేసుకున్న సినిమాలు కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ హిట్గా మారుతాయి మరికొన్నిసార్లు డిజాస్టర్ గా నిలుస్తుంటాయి. అయితే ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా నటించి మెప్పించినటువంటి మోహన్ బాబు కెరియర్ ఒకానొక సమయంలో పూర్తి ఇబ్బందులలో పడిందట.

ఇలా ఇబ్బందులలో ఉన్నటువంటి ఈయన సినిమాల కోసం తన ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. ఇక చివరికి తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నటువంటి తరుణంలో ఓ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. ఈ సినిమా హిట్ తర్వాత మోహన్ బాబు నటించిన సినిమాలన్నీ కూడా అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడటం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత పోగొట్టుకున్న ఆస్తులను సంపాదించుకున్నారు అలాగే విద్యానికేతన్ సంస్థలను కూడా స్థాపించారు.

ఈ విధంగా మోహన్ బాబు జీవితాన్ని మార్చేసినటువంటి సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేదో కాదు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు శోభనా నటించిన అల్లుడుగారు ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో హీరోగా నటించిన మోహన్ బాబు కాదట ఈ సినిమాలో చిరంజీవి నటించిన ఈ సినిమా క్లైమాక్స్ చిరంజీవికి నచ్చకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి పాత్ర చనిపోతుంది ఇలా తాను చనిపోయే పాత్రలో నటిస్తే తన అభిమానులకు ఇష్టం ఉండదని చిరంజీవి ఈ సినిమాని రిజెక్ట్ చేశారట ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో రాఘవేంద్రరావు మోహన్ బాబుని సంప్రదించారు. ఈ సినిమా కోసం తన ఆస్తులను కూడా అమ్మి సినిమాని తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పోగొట్టుకున్న ఆస్తులతో పాటు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకో లేదని తెలుస్తోంది

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -