Mohan Babu: సన్నాఫ్ ఇండియా, జిన్నా సినిమా ఫ్లాప్ కి కారణం చెప్పిన మంచు మోహన్ బాబు.. ఏమైందంటే?

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటీ. మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో కి మోహన్ బాబు అడుగుపెట్టి కెరియర్ మొదట్లో విలన్ పాత్రలలో నటించారు. అనంతరం హీరోగాను నిర్మాతగానో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

మోహన్ సినీ కెరియర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ అద్భుతమైన సినిమాలు ఉన్నాయని చెప్పాలి. ఇక ఈయన వారసులుగా మంచు విష్ణు మనోజ్ ప్రసన్న కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే వీళ్ళు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. ఇకపోతే మోహన్ బాబు ఇప్పటికి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు.

ఇకపోతే విష్ణు కూడా చివరిగా జిన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి గల కారణాల గురించి తాజాగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సన్నాఫ్ ఇండియా సినిమాని ఒక ప్రయోగాత్మక సినిమా అని ప్రకటించాము.

ఇలా చేయడం వల్ల ప్రయోగాత్మక సినిమాని ఏం చూస్తాము అన్న కారణంతోనే ఈ సినిమా చూడటానికి ఎవరు రాలేదని నేను భావిస్తున్నాను అంటూ మోహన్ బాబు తెలిపారు. ఇకపోతే జిన్న సినిమాలో విష్ణు నటన ఎంతో అద్భుతంగా ఉంది ఆయనప్పటికీ ఈ సినిమా ఎందుకు సక్సెస్ కాలేదు అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అంటూ మోహన్ బాబు ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -