Mohan Babu: వైరల్ అవుతున్న మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

Mohan Babu:టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు మనందరికీ సుపరిచితమే. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సూపర్ హిట్ సినిమాలలో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు. హీరోగా విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. అలాగే మోహన్ బాబు తన కెరియర్ లో దాదాపుగా 500కు పైగా సినిమాలలో నటించారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి పదుల సంఖ్యలో సినిమాలను తెరకెక్కించారు.

 

ఇక మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కొడుకులు మంచు మనోజ్, మంచు విష్ణు లు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎవరికీ వారు ప్రత్యేకంగా గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు వ్యక్తిగత విషయాల గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఏదైనా కూడా కుండలు బద్దలు కొట్టుకుంటూ మొఖం మీద మాట్లాడే నైజం మోహన్ బాబుది. ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ గురించి మంచి ఫ్యామిలీ లోని వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరియర్ లో జరిగిన విషయాల గురించి అలాగే తన కుటుంబం పై నెగిటివ్ గా వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ఎవరెవరో వార్తలు రాస్తూ ఉంటారు. వాళ్లకు తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు. అయినా వాళ్లకు భగవంతుడు మంచి చేయాలని నేను భావిస్తాను. నెగిటివ్ వార్తలను ఎవరు రాయిస్తున్నారో తెలుసు కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను అని తెలిపారు.

 

అలాగే ఇతరులు చెడిపోవాలని కోరుకుంటే వాళ్లే చెడిపోతారు తెలిపారు మోహన్ బాబు. మన గురించి ఒకరు చెడుగా రాసే వాళ్ళు తాత్కాలికంగా బాగున్నప్పటికీ ఆ తర్వాత వారి భవిష్యత్తును కాలం నిర్ణయిస్తుంది అని కూల్ గా సమాధానం ఇచ్చారు మోహన్ బాబు. అలాగే జీవితంలో ఎప్పుడైనా తప్పు చేసాను అని మీకు అనిపించలేదా అని యాంకర్ అడగగా మన పరంగా తప్పు చేశాను కానీ నిజజీవితంలో నేను ఎవరికి అన్యాయం చేయలేదు. చెయ్యను చేయబోను అని తెలిపారు మోహన్ బాబు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -