Mohan Babu: మనోజ్ పెళ్లిపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరచుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు మంచు ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీలో ఎవరో ఒకరు తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి గురవుతూనే ఉంటారు. మంచు విష్ణు లేదంటే మోహన్ బాబు మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఇలా ఎవరో ఒకరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంటాయి. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేర్లలో భూమా మౌనిక రెడ్డి,మంచు మనోజ్ ల పేర్లు కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో భూమా మౌనిక రెడ్డి,మంచు మనోజ్ లు ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి ఒకటి కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను ఎట్టకేలకు నిజం చేస్తూ ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు మనోజ్ మౌనిక. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు మంచు మనోజ్ పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించారు. మంచు మనోజ్ పెళ్లి, వ్యవహారం మోహన్ బాబు కి ఇష్టం లేదని అందుకే ఏ విషయంలోనూ కనిపించడం లేదు ముందు పడడం లేదు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా మంచు మనోజ్ ని కుటుంబం దూరం పెడుతోంది అంటే కూడా వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన మోహన్ బాబు..

 

మనోజ్ పెళ్లి గురించి నాకు ముందే చెప్పాడు. అయితే నేను ఓ సారి ఆలోచించు అన్నాను. లేదు నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం సరైనదేనని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ చేసుకో అన్నాను అంతే. ఇక ఎవడో ఏదో అనుకుంటాడు అని మనం చేసే పని ఆపకూడదు అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. అనంతరం వార్తలను సృష్టించే వారి గురించి కాస్త ఘాటుగా స్పందించారు.. ఏనుగు దారిపై వెళ్తుంటే.. దాని వెనకాల ఎన్నో కుక్కలు మెురుగుతాయి, మనం ఎన్ని కుక్కలను అపుతాం.. ఇక మెురిగే కుక్కలను నువ్వు మెురగనివ్వు అంటూ.. వారిని కుక్కలతో పోలుస్తూ ఘాటు వాఖ్యలు చేశారు మోహన్ బాబు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -