Tollywood: మంచి సక్సెస్ వచ్చిన కూడా హిట్ కాదని ముద్ర వేసిన సినిమాలు ఏంటో తెలుసా?

Tollywood:  సాధారణంగా ఇండస్ట్రీ హిట్ సినిమాల గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏదైనా స్టార్ హీరో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్నప్పుడు వారి అభిమానులు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారో మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నప్పటికీ వాటి విషయంలో చాలా కాంట్రవర్సీ మొదలవుతుంది. తమ అభిమానులు ఇండస్ట్రీ హిట్ అని అనుకుంటుంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం అది కాదని కొట్టి పారేస్తారు. ఇప్పుడు మనం అలా వివాదాస్పద ఇండస్ట్రీ హిట్ సినిమాల వివరాలు తెలుసుకుందాం.

ఖైదీ: 1983 విడుదలై సెన్సేషనల్ హిట్ సంపాదించుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చిరంజీవి ఫ్యాన్స్ అన్నారు. కానీ అంతకు ముందు వచ్చిన ప్రేమాభిషేకం, కొండవీటి రాజా సినిమాలను ఖైదీ సినిమా క్రాస్ చేయలేదని ఇది ఇండస్ట్రీ హిట్ కాదని మిగిలిన ఫ్యాన్స్ అంటూ ఉంటారు.

నిన్నే పెళ్లాడత: ఈ సినిమా 1996లో బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించుకుంది. ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ అని నాగార్జున అభిమానులు చెప్పుకుంటారు. కానీ అంతకుముందు వచ్చిన పెదరాయుడు సినిమాను ఈ సినిమా క్రాస్ చేయలేదని కాబట్టి ఇది ఇండస్ట్రీ హిట్ కాదని యాంటీ ఫ్యాన్స్ అంటూ ఉంటారు.

కలిసుందాంరా: నిజానికి ఈ సినిమా అప్పట్లో మరో స్థాయిలో విజయాన్ని సంపాదించుకుంది. కానీ షేర్ పరంగా సమరసింహ రెడ్డి సినిమాను క్రాస్ చేయలేదని బాలయ్య అభిమానులు చెబుతూ ఉంటారు. కానీ వెంకటేష్ ఫాన్స్ కలిసుందాం రా సినిమాను ఇండస్ట్రీ హిట్ గానే సూచిస్తూ ఉంటారు.

ఖుషి: 2001లో విడుదలై సెన్సేషనల్ హిట్ దక్కించుకున్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు ఇండస్ట్రీ హిట్ గా సూచిస్తూ ఉంటారు. కానీ ఆలా కాదు. నరసింహ నాయుడు సినిమాను క్రాష్ చేయలేదు అని నందమూరి బాలకృష్ణగారి ఫ్యాన్స్ వాదిస్తూ ఉంటారు. మరి ఈ రెండు సినిమాల్లో ఇండస్ట్రీ హీట్ గా ఏవి ఉన్నాయో ఇప్పటికీ సోషల్ మీడియా లో ఒక ప్రశ్న గానే మిగిలిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -