Movies: ఈ సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణమేంటో తెలుసా?

Movies: ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదలకు ముందు మంచి టాక్‌తో దూసుకెళ్తుంటాయి. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని పుకార్లు వినిపిస్తాయి. కానీ థియేటర్లలో రిలీజ్ అయ్యాక.. సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. మొదట్లో హిట్ టాక్ వచ్చినా.. తర్వాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటేంటో ఒక్కసారి చూద్దాం.

 

అంటే సుందరానికి..

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘అంటే సుందరానికి..’. ఈ సినిమా విడుదలకు ముందు సూపర్ హిట్ అవుతుందని భావించారు. కానీ ఊహించిన స్థాయిలో సినిమా ఫ్లాప్ అయింది. అప్పుడే థియేటర్లలో వేరే సినిమాలు రిలీజ్ అవ్వడం, టికెట్ల ధరలు పెరగడమే మూవీకి మైనస్ అయ్యాయని సినీ ప్రముఖులు తెలిపారు.

 

శ్రీకారం..

శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ‘శ్రీకారం’. ఈ సినిమాకు మొదట్లో చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా తప్పనిసరిగా హిట్ అవుతుందని భావించారు. సినిమా పరంగా మంచి టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది.

 

జాను..

శర్వానందర్ హీరోగా.. సమంత హీరోయిన్‌గా నటించిన తమిళ రీమేక్ చిత్రం ‘జాను’. ఈ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు నిర్మాత దిల్ రాజుకు చాలా మంది వద్దని చెప్పారట. కానీ దిల్ రాజు మాట కూడా వినకుండా డబ్ చేశారట. అయితే సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ థియేటర్ వద్ద బోల్తా కొట్టింది.

 

వైల్డ్ డాగ్..

నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’. నూతన దర్శకుడు ఆహీషోర్ సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్ మూవీగా మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాపై నాగార్జున కూడా హిట్ కొడతారనే నమ్మారు. కానీ సినిమా హిట్ అయినా.. కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

 

ఉన్నది ఒకటే జిందగీ..

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ సినిమా ఫ్రెండ్షిప్, లవ్ కాన్సెప్ట్ తో చూడటానికి చాలా బాగుంది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ కాలేదు.

 

ఎటో వెళ్లిపోయింది మనసు..

నాని-సమంత జోడిగా నటించిన చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఫీల్ గుడ్ మూవీగా మొదట్లో మంచి హిట్ టాక్ వచ్చింది. కానీ థియేటర్లలో రిలీజ్ అయ్యాక పూర్తిగా బోల్తా కొట్టింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -