Mp Gorantla Madhav: రాజకీయంగా చంద్రబాబు చచ్చిపోతాడనేది నా ఉద్దేశం.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు వైరల్!

Mp Gorantla Madhav: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా చంద్రబాబు నాయుడు గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు నాయుడు 2024లో చస్తాడు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్లపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సామాజిక సాధికారత యాత్రలో భాగంగా పాల్గొన్నటువంటి ఈయన చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీ యాత్ర చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర ప్రారంభించి ఆ యాత్ర వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నార. ఇలా ఎవరు ఎన్ని యాత్రలు చేసినా జగన్ జైత్రయాత్రను మాత్రం అడ్డుకోలేరని 2024వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చంద్రబాబు నాయుడు చస్తాడు అంటూ కామెంట్ చేశారు.

ఇప్పటికే రాజమండ్రి జైలులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రాణాలకు హాని ఉంది అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి సమయంలోనే గోరంట్ల మాధవ్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త తెలుగుదేశం నేతలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను చంద్రబాబు నాయుడు చస్తాడు అన్నది కేవలం రాజకీయ పరంగా మాత్రమే ఇక్కడ వాక్య నిర్మాణ లోపమే తప్ప భావం మాత్రం కాదు అంటూ ఈయన తెలిపారు. 2024వ సంవత్సరంలో వైఎస్ఆర్సిపి పార్టీ 175 సీట్లు గెలుపొందుతుందని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని రాజకీయపరంగా చంద్రబాబు నాయుడు తన పార్టీ సమాధి అవుతుందన్న ఉద్దేశంలోనే తాను మాట్లాడానని ఈ సందర్భంగా ఈయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -