Kesineni Nani: పూర్తిగా కొడాలి నానిలా మారిపోయిన కేశినేని నాని.. టీడీపీపై బురదజల్లడమే నాని నైజమా?

Kesineni Nani: ఏపీ రాజకీయాల్లో కేసినేని నాని ఓ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అందుకే ఆయన గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా టీడీపీ తరుఫున విజయవాడ ఎంపీగా గెలిచారు. అయితే, ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఆ స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారు. కేశినేని నాని కామెంట్స్ కొడాలి నానికి గుర్తు చేసేలా ఉంటున్నాయి. పార్టీలు మారడం సహజం.. స్థానిక పరిస్థితులను బట్టి పార్టీలు మారాల్సి వస్తుంది. కానీ, పార్టీ మారినా వ్యక్తిగత ఇమేజ్ తగ్గించుకోకూడదు. కేశినేని నాని వైసీపీలో చేరిన తర్వాత గతంలో ఉన్న ఇమేజ్ ఆయనే తగ్గించుకుంటున్నారు.

చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేస్తూ గతంలో ఆయన ఏం మాట్లారో అనే విషయాన్ని మర్చిపోతున్నారు. చంద్రబాబు, లోకేష్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ టీడీపీ టికెట్లు అమ్ముంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో రాష్ట్రం వదిలి వెళ్లిపోతారని విమర్శించారు. అయితే.. ఓ విమర్శ చేసే ముందు ఆలోచించాలి. టీడీపీ అనేది ఓ లోకల్ పార్టీ. దానికి అధ్యక్షడు చంద్రబాబు. ఆయన కనసన్నల్లోనే పార్టీ నడుస్తోంది. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు కానీ.. గెలవని అభ్యర్థులకు టికెట్లు అమ్ముకుంటారా? అలా చేస్తే.. 40 ఏళ్లు పార్టీకి మనుగడ ఉంటుందా?

సరే కేశినేని నాని చెప్పినట్టు.. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారనే అనుకుందాం. 2014, 2019 ఎన్నికల్లో ఆయన చంద్రబాబు దగ్గర ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొన్నారు? ఆయన రేటెంత అనేది చెప్పాలి. లేకపోతే చంద్రబాబు.. కేశినేనినానికి టికెట్ ఫ్రీగా ఇచ్చి మిగిలిన వారికి అమ్ముకున్నారా? ఒకేవేళ టికెట్లు చంద్రబాబు అమ్ముకుంటే.. అప్పుడు ఎందుకు వైసీపీని వీడలేదు? లేదంటే.. చంద్రబాబుతో బేరం కుదరక ఇప్పుడు వైసీపీలో కేశినేని చేరారా? ఈ అన్ని ప్రశ్నలకూ ఆయన సమాధానం చెప్పాలి.

టికెట్లు అమ్ముకున్నారు అనే దగ్గర ఆగకుండా చంద్రబాబు, లోకేష్.. జగన్ ను చూసి బుద్ది తెచ్చుకోవాలని కేశినేని సూచించారు. జగన్ పేదలకు టికెట్ ఇస్తుంటే.. చంద్రబాబు టికెట్లు అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే, కేశినేని నానిపై టీడీపీ శ్రేణులే కాదు.. మామూలు ఓటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేశినేని తన స్థాయిని మరచి వ్యహరింస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబు దేవుడు అని.. జగన్ రాక్షసుడు అన్న మాటలను మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో చేరిన తర్వాత కొడాలి నానితో పోటీ పడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.

కేసినేని నాని ప్రజారాజ్యం నుంచి టీడీపీలో చేరినప్పుడు కూడా ఇలాగే రచ్చ చేశారు. చిరంజీవి టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఆ విమర్శలతో ప్రజారాజ్యానికి చేయాల్సిన నష్టం అంతా చేశారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని టీడీపీపై ప్రయోగిస్తున్నారు. కానీ, అప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితుల వేరు. ఈ పదేళ్లలో కేశినేని నాని ఎప్పుడు ఏం మాట్లాడారో? సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇంతవరకూ మంచివాడైన చంద్రబాబు.. ఇప్పుడే ఎందుకు చెడ్డవాడు అయ్యాడో ఒక్క బలమైన కారణం చెప్పకపోతే.. కేశినేని నాని విమర్శలను ఎవరూ పట్టించుకోరు కదా.. ఆయన స్థాయి కూడా తగ్గిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -