YSRCP: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన అప్పుడేనట.. దొంగ హామీలతో జగన్ మళ్లీ మోసం చేస్తారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా ప్రజలలోకి వెళ్తే పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల ద్వారా పలు ప్రాంతాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున తన పార్టీని ప్రజలలోకి తీసుకు వెళుతున్నారు. ఇప్పటికే మూడు సిద్ధం సభలను నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనెల 10వ తేదీ బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నాల్గవ సిద్ధం సభలను నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు.

ఈ సిద్ధం సభ వ్యవహారాలన్నింటిని రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఈయన ఒంగోలులో సిద్దం సభ పోస్టర్‌ను విడుదల చేశారు .ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సిద్ధం కార్యక్రమాలలో ఇది నాలుగవ కార్యక్రమం అని, ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సుమారు 15 లక్షల మంది అభిమానులు కార్యకర్తలు తరలి రానున్నట్లు అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సర కాలంలో రాష్ట్రానికి తమ ప్రభుత్వంలో ఎలాంటి పాలన అందింది ప్రజలకు ఎలాంటి మేలు చేశారు అనే విషయాల గురించి ప్రకటిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

ఇకపోతే ఈ సిద్ధం సభ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని విజయసాయిరెడ్డి తెలియజేశారు. ఇక మార్చి 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విలువడే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్లి ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నారు అంటూ ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -