TDP-Janasena: వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన ఎంపి…!

TDP-Janasena: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడిలో అందరి దృష్టి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి పైనే ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు ప్రకటించినప్పటి నుండి కూడా రాష్ట్రంలో రాజకీయం పరిస్థితులు మారిపోయాయి. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి అని తెలిసినప్పటినుండి కూడా వైసిపి నాయకులకు కుదురు లేకుండా పోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిస్తే అది వైసీపీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే వైసిపి నాయకులు చేత పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి అంటూ సవాళ్లు విసిరిస్తూ ఉంటారు.

 

ఇదిలా ఉంటే ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉంది. ఈ లోగోపాల్ రాజకీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముఖచిత్రం పైన సర్వేలు చేయిస్తూ వస్తున్నాయి. అయితే ఈ సర్వేలో భాగంగా 2024 లో వచ్చేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అని తేల్చి చెబుతున్నాయి కానీ, ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం పైన ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతుంది. అయితే నర్సాపురం నియోజకవర్గ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేశారు. రఘురామకృష్ణంరాజు ముందు నుంచి కూడా వైసీపీ రెబల్ ఎంపీ గానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రవర్తన నచ్చక ఆయన పార్టీకి దూరంగా మసులుతున్నారు.

నాలుగు సంవత్సరాల తర్వాత తాజాగా సొంత నియోజకవర్గంలోకి వచ్చిన ఆయన రాబోయే ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి 135 సీట్లు దాటి వస్తాయని చెప్పారు. ఇది ఎన్నికల సమీపించే కొద్ది ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి నరసాపురం నుండి ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తారని తెలిపారు. అయితే తెలుగుదేశం నుండి పోటీ చేస్తారా జనసేన నుండి పోటీ చేస్తారా అనేది త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.

 

ఇలా రాష్ట్రంలో ఏ నాయకుడు నోట విన్న ఏ సర్వే చూసినా వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటుంది. ఇది తెలిసే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పుపై దృష్టి సారించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే అభ్యర్థులు అత్యంత మాత్రాన ఫలితాల్లో ఏమాత్రం తేడా రాదని, మహా అయితే నాలుగైదు సీట్లు డిఫరెన్స్ కనిపిస్తుందని అంటున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని కుండ బద్దలు కొడుతున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -