Mudragada: కాపుల కోసం కాదు.. వైసీపీ కోసం పని చేస్తా.. ముద్రగడ సంచలన వ్యాఖ్యల వెనుక ప్లాన్ ఇదేనా?

Mudragada: పెళ్లి చేయాలన్నా.. ఇల్లు కట్టాలన్న ఓ సమయం రావాలి. వాటి కోసం మనం ఎంత ఆరాటపడినా ముందుకు సాగవు. అలాగే.. రాజకీయాల్లో కొందరి నాయకుల ముసుగు తొలగాలన్నా దానికి కూడా ఓ సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు వద్దననుకున్నా ముసుగు తొలగిపోతుంది. గత కొన్ని రోజుగా ముద్రగడ పద్మనాభం ముసుగు తొలుగులూ వస్తోంది. వైసీపీలో చేరిన తర్వాత ఆయన పెట్టిన తొలి ప్రెస్‌మీట్‌లో కాపుల కోసం కాదు వైసీపీకి కోసం పని చేస్తానని ఆయనే స్పష్టంగా చెప్పారు. అంతేకాదు కాపులు ఉద్దరణకు కృషి చేస్తున్న మహానుభావుడని జగన్ పై ప్రశంసల వర్షం కురించారు. అటు.. పవన్ వ్యవహార శైలి తనకు నచ్చలేదని అన్నారు. నిజానికి తాను జనసేనలోనే చేరాలనుకున్నానని చెప్పారు. కానీ, 21 సీట్లకు పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం నచ్చలేదని అన్నారు. కనీసం పొత్తులో భాగంగా 2 ఏళ్ల పాటు సీఎం పదవిని కోరాలని పవన్ కు సూచించినా ఆయన పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. అందుకే.. వైసీపీలో చేరానని చెప్పారు. అయితే, ముద్రగడ పద్మనాభం వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పిన జగన్ పార్టీలో ఎలా చేరుతారో చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తనను తాను కాపు ఉద్యమకారుడిగా ప్రకటించకున్న ముద్రగడ కాపులకు ఏ హామీతో వైసీపీలో చేరారో చెప్పాల్సి ఉంది. కానీ, ఆయన మాటలు విన్న తర్వాత ఇక కాపుల నుంచి కూడా ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు.

ఎందుకంటే వైసీపీలో చేరిన తర్వాత ఆయన కాపు ముసుగు తీసేశారు. తాను కాపుల కోసం కాదని.. వైసీపీ కోసం పని చేస్తానని చెప్పారు. అంతేకాదు.. కాపుల్లో 5 శాతం మంది మాత్రమే తనకు మద్దతిచ్చారని అన్నారు. అటు దళితులు, బీసీలే ఎదుగుదలకు అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంటే.. ఇక కాపు నేత అనే ట్యాగ్ ఆయన వదులుకున్నట్టేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తన ఎదుగుదలలో కాపులు సహకారం లేనపుడు ఆయన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఉద్యమం చేశారు? తునిలో రైలు తగలబెట్టే వరకు పరిస్థితిని ఎందుకు తీసుకెళ్లారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే.. కాపు ఉద్యమం పేరుతో టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ఆయన ఉద్యమం చేశారా? అనే ప్రశ్నకు ముద్రగడ సమాధానం చెప్పాలి.

ఆయన రాజకీయ భవిష్యత్ కోసమే ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఎంచుకున్నారు. ఆ ట్యాగ్ వాడుకొని రాజకీయ పబ్బం గడపాలని అనుకున్నారు. మొదట వైసీపీలో చేరాలి అనుకున్నారు. కానీ, అక్కడ టికెట్ నిరాకరించడంతో జనసేన వైపు చూశారు. జనసేనలో రెండు టికెట్లు డిమాండ్ చేశారు. దానికి పవన్ నిరారించడంతో మళ్లీ వైసీపీలో చేశారు. ఇంతా చేసిన తర్వాత ఆయన వైసీపీలో టికెట్ సాధించారా అంటే అదీ లేదు. వైసీపీ చివరి జాబితాలో కూడా ఆయన పేరు లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -