Mudragada: ముద్రగడ నిజస్వరూపం బయటపడిందిగా.. ఇప్పటికైనా ఏపీ ప్రజల తీరు మారుతుందా?

Mudragada: కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరుతారని అందరూ భావించారు అయితే పెట్టుకోవడానికి ముందు వరకు కూడా జనసేన పార్టీకి పరోక్షంగా సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఈయనతో పాటు చేగొండి హరి రామ జోగయ్య కూడా ఏకంగా లేఖల రూపంలో పవన్ కళ్యాణ్ కు దిశా నిర్దేశాలు చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో ఒక క్లారిటీ కి రావడంతో హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం వంటి వారందరి అసలు స్వరూపాలు బయటపడ్డాయి. పొత్తులో భాగంగా టిడిపి నుంచి పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సీట్లు తీసుకోవడం తమకు నచ్చలేదన్న కారణంతో వీరు పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీ పార్టీలోకి చేరారు.

ఇక జనసేనాని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా మద్దతు తెలియజేయాలని భావించారు. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారందరూ టిడిపికి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఒక కాపు నేత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలంటే తప్పనిసరిగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరి మద్దతు కూడా లభించాలి.

కానీ ముద్రగడ పద్మనాభం వంటి వారు పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించలేదని టిడిపి పొత్తులో భాగంగా తక్కువ సీట్లు తీసుకున్నారు అంటూ ఏవేవో కారణాలు చెప్పి ఈయన జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు. మరి అక్కడికి చేరినటువంటి ఈయనను స్వయంగా జగన్ తన ఇంటికి వచ్చి ఆహ్వానించలేదు ఈయనే అక్కడికి వెళ్లి పార్టీలో చేరారు. ఇక ముద్రగడ జనసేన పార్టీకి దూరమైన ఆయన ద్వారా పెద్దగా వచ్చిన నష్టం ఏ మాత్రం పార్టీకి లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -