Mudragada: ముద్రగడను పిలిచి మరీ అవమానిస్తున్న సీఎం జగన్.. వైసీపీలో చేరతానని చెప్పి తప్పు చేశారా?

Mudragada : కాపుల ఆత్మగౌరవం అంటూ ముద్రగడ చాలా పోరాటాలు చేశారు. అయితే, ఆయన కాపుల ఆత్మ గౌవరం ఎంత నిలబెట్టారో తెలియదు కానీ.. ఆయన ఆతగౌరవాన్ని మాత్రం అడుగడునా వదులుకుంటున్నారు. పిలిచినట్టే పిలిచి జగన్.. ముద్రగడకు వరుస షాకులు ఇస్తున్నారు. ముద్రగడ కాపుల పేరు చెప్పి దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. తునిలో ట్రైన్ తగలబడిన ఘటన కూడా అందరికీ తెలిసిందే. అప్పుడు చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు తొలగించారు. కానీ, అప్పుడు ముద్రగడలో ఎలాంటి స్పందన లేదు. రిజర్వేషన్ల ఎందుకు తొలగించారనే ప్రశ్నే లేదు. గత ఏడాది చేసిన వారాహి యాత్రలో పవన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు ద్వారంపూడిని వెనకేసుకొని వచ్చారు ముద్రగడ. అంతేకాదు.. పవన్ విమర్శిస్తూ బహిరంగ లేఖలు రాశారు. ద్వారంపూడి గొప్పవాడని.. పవన్ చేతకాని వాడని ఆ లేఖల సారంశం. అంతేకాదు.. పవన్‌ను, జనసేనను ఛాలెంజ్ చూస్తూ కూడా లేఖలు రాశారు. ఇవన్నీ జగన్ అండ చూసుకొని చేశారు. తుని ఆందోళనలు కానీ.. ద్వారంపూడి విషయంలో పవన్ కు బహిరంగ లేఖలు కానీ.. వైసీపీ అధినేత జగన్ ను ప్రసన్నం చేయడానికే చేశారు. ఇలా చేస్తే వైసీపీలో ఏ ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో దక్కకపోతుందా? అనుకున్నారు. వైసీపీ ఆయనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటిస్తుందని ఆయన వర్గీయుల ప్రచారం కూడా చేశారు. కానీ… ఇప్పటి వరకు వైసీపీ జాబితాల్లో ముద్రగడ పేరు లేదు.

దీంతో… ముద్రగడ ఇన్ డైరెక్ట్‌గా మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. వైసీపీలో చేరే ఆలోచన తనకు లేదని చెప్పారు. జగన్ తన దూతలను తన దగ్గరకు పంపించొద్దని ఆ లేఖలో వివరించారు. అంతేకాదు.. జనసేనలో కానీ.. టీడీపీలో కానీ చేరుతానని కూడా చెప్పారు. అంతేకానీ వైసీపీలో మాత్రం చేరే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే, మరోదారి లేక ముద్రగడ జనసేన లేదా టీడీపీ అంటున్నారు తప్పా నిజంగా ఆయనకి తమతో ఉండటం ఇష్టం లేదని చంద్రబాబు, పవన్ గ్రహించారు. అయితే అప్పటికే ముద్రగడ వ్యవహారం గ్రహించిన పవన్ ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదలకు తనను సంప్రదించలేదని.. ముద్రగడ.. పవన్, చంద్రబాబుపై కోపంతో వైసీపీకి ఆయన దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. వైసీపీ అనుకూల ప్రకటనలు చేసి.. వారిని ఆకర్షించారు. దీంతో.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ తన కొడుకు భవిష్యత్ పై ప్రస్తావించగా.. ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. ఎన్నికలు అవ్వాలి. ఫలితాలు రావాలి. గెలిస్తే అప్పుడు కదా? అని మిథున్ రెడ్డి అనుకున్నారు. అయితే.. కనీసం గౌరవ ప్రధంగానైనా వైసీపీలో చేరుదామనుకుంటే ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశారు సీఎం జగన్.

వైసీపీలో చేరికకు పెద్ద ఎత్తున ముద్రగడ ప్లాన్ చేశారు. అనుచరగణంతో తన బలాన్ని చూపించాలని అనుకున్నారు. పెద్ద ర్యాలీ నిర్వహించి తాడేపల్లికి వెళ్లాలి అనుకున్నారు. కానీ.. సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుంది.. హంగు ఆర్భాటాలు లేకుండా ఒక్కరే రావాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయట. దీంతో.. రెండో దారి లేక ఈ నెల 15 లేదా 16న ఒక్కడినే వెళ్లి పార్టీలో చేరుతానని ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. అభిమానులు ఎవరూ బాధపడొద్దని ఆ లేఖలో వివరించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -