Mudragada Padmanabham: వైసీపీలో చేరిన ముద్రగడ గొప్పదనం తెలుసా.. కాపుల కోసం ఆయన ఇంత కష్టపడ్డారా?

Mudragada Padmanabham: కాపు ఉద్యమం కోసం పదవులను వదిలి ఆస్తులను ధారపోసి తమ హక్కులను పొందడం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టినటువంటి వారిలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఒకరు. ఈయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కొనసాగారు. అయితే ఉన్నఫలంగా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ముద్రగడ కాపు ఉద్యమం కోసం పోరాడారు .అయితే ఆ సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు ముద్ర గడను అలాగే ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయించారు.

ఇలా కాపులకు వ్యతిరేకంగా మారినటువంటి చంద్రబాబు నాయుడు కాపుల కోసం సాధ్యం కానివి కూడా సుసాధ్యం చేస్తానని మాయ మాటలు చెప్పి నమ్మించారు. ఇక చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మారినటువంటి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరుతారని అందరూ భావించారు. అయితే ఈయన జనసేన పార్టీలోకి చేరకుండా చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ ద్వారా పావులు కదిపారని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు నక్క తెలివితేటలు ముద్రగడకు తెలుసు తాను చేసే మోసాలు అన్నింటిని ఎక్కడ బయట పెడతారోనన్న ఉద్దేశంతో ఈయన జనసేన పార్టీకి కూడా వారిని దూరం పెట్టారు. అందుకు నాదెండ్ల మనోహర్ కూడా బాగా సహకరించారని సమాచారం. ఇలా జనసేన పార్టీలోకి ముద్రగడ వస్తే తనకు చాలా అనుకూలంగా మారుతుందని కాపు ఓట్లు ఆకర్షించడానికి ఎంతో కీలకమవుతారని పవన్ కళ్యాణ్ కూడా భావించారు.

అయితే చంద్రబాబు నాయుడు అతి తెలివితేటలను ఉపయోగించి వీరిని పక్కన పెట్టారు. దీంతో ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య కుమారుడు వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు. ఇలా వీరంతా వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరడంతో పవన్ కళ్యాణ్ నాకు సలహాలు ఇస్తూ వైసిపి లోకి చేరుతున్నారు అంటూ వీరిపై సెటైర్లు వేశారు దీంతో కాపులలో మరింత వ్యతిరేకత ఏర్పడింది.

ఇలా ముద్రగడ పద్మనాభం వైయస్సార్సీపి పార్టీలోకి చేరడంతో కాపు ఓట్లు టిడిపి జనసేన కూటమికి వెళ్లకుండా ముద్రగడ అడ్డుకోగల సామర్థ్యం ఉంది ముఖ్యంగా కాపులకు ఉభయగోదావరి జిల్లాలలో కాపులకు మంచి ప్రాధాన్యత ఉంది అయితే చంద్రబాబు నాయుడు గతంలో కాపులకు చేస్తానన్న మేలు ఒకటి కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కాపులకు ఎంతో అండగా నిలిచారు. ప్రస్తుతం కూడా రెండు ఎంపీ టికెట్లతో పాటు 19 ఎమ్మెల్యే స్థానాలను కాపులకు కేటాయించి వారికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మహిళలకు కాపు నేస్తం ద్వారా జగన్ మహిళల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు ఇలా ఆయన కాపుల కోసం చేసినటువంటి మంచి పనులు ఆయనకు ఇప్పుడు ఎంతో ప్రయోజనకరంగా మారాయని తెలుస్తుంది. ఇక ముద్రగడ్డ చేరడంతో వైసిపికి కాపులలో ఎదురులేదని స్పష్టంగా అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -