Mudragada Padmanabham: జనసేన క్లోజ్ అంటున్న ముద్రగడ.. ఇలాంటి కామెంట్లే వైసీపీని ముంచనున్నాయా?

Mudragada Padmanabham: కాపు ఉద్యమనేతగా పేరు సంపాదించుకున్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం శుక్రవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వైసిపి పార్టీలోకి చేరినటువంటి ఈయన శనివారం కిర్లంపూడిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎన్నికల తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవుతుందని ఈయన తెలిపారు. ఇక నేను రాజకీయాలలోకి రావడానికి కాపులు కేవలం ఐదు శాతం మంది తనకు సపోర్ట్ చేశారని బిసి ఎస్సీ ఎస్టీల ద్వారా నేను రాజకీయాలలో ఈ స్థాయికి ఎదిగానని ఈయన తెలియజేశారు. ఇక వచ్చే 30 సంవత్సరాలు పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారని ఈయన తెలిపారు.

ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? ఆయన కాపు జాతిని అవమానిస్తుంటే ఈయన ఏం చేశారని ప్రశ్నించారు. మొలతాడు లేనోళ్లు కూడా రాజకీయాల గురించి మాట్లాడతారు అంటూ ముద్రగడ్డ ఎద్దేవా చేశారు. మీరు సినిమాలలో మాత్రమే హీరోలు,హీరోలను రాజకీయాలలో ఆదరించే రోజులు పోయాయని రాజకీయాలలో నేనే హీరో అంటూ ఈయన మాట్లాడారు.

నేను వైయస్సార్సీపి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ పార్టీలోనే ఉన్నాను మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని అయితే తిరిగి ఈ పార్టీలోకి చేరటం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మీలాంటి వారి మాటల వల్లే ఇప్పటికే వైసీపీ సగం మునిగిపోయిందని ఇంకా మునిగిపోతుంది అంటూ ఈయన వ్యాఖ్యలపై పలువురు కాపు నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -