Munugode Bye-election: మునుగోడు ఉపఎన్నికలో వైఎస్సార్టీపీ పోటీ.. అభ్యర్థిగా బీసీ నేత?

Munugode Bye-election: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. నవంబర్ లేదా డిసెంబర్ లో బైపోల్ కు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. నోటిఫికేషన్ జారీ చేసిన నెల రోజులకే ఎన్నికలు జరుగుతాయి. దీంతో పార్టీలన్నీ ఇప్పటినుంచే ప్రచారాన్ని వేగవంతం చేశాయి. సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అభ్యర్థులు ఎవరనేది దానిపై అంతర్గతంగా శ్రేణులకు స్పష్టత ఇస్తున్నాయి. ఉపఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఇప్పుడే బయటకు అధికారికంగా ప్రకటిస్తే.. టికెట్ ఆశించిన భంగపడ్డ నేతలు అసంతృప్తి చెందే అవకాశముంది. అసంతృప్త నేతలు ఇతర పార్టీల వైపు వెళితే నష్టం చేకూరుతుంది. అందుకే ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు జంకుతున్నాయి.

బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఇక అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ లో సీటుకు భారీ పోటీ నెలకొంది. నలుగైదుగురు సీటు కోసం ఆయా పార్టీల్లో పోటీ పడుతున్నారు. తమకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టికెట్ల విషయంలో పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడే ప్రకటిస్తే నష్టమని భావించిన పార్టీలు.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్ధి ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశముంది. కానీ అభ్యర్థుల విషయంలో పార్టీలన్నీ ఒక క్లారిటీ వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఫిక్స్ చేసే అవకాశముంది. ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పుడే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోరు రంజుగా జరుగుతుండగా.. ఇప్పుడు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో వైఎస్సార్ టీపీ తరపున అభ్యర్ధిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే మునుగోడులో షర్మిల పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యారు. ఇలాంటి తరుణంలో పోటీ చేసి కొన్ని ఓట్లను సంపాదించుకోగలిగితే ప్రజల్లో పార్టీకి బలం పెరుగుతుందని షర్మిల భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ ఉందనే విషయాన్ని ప్రజలు మరిచిపోతారని, అందుకే ఉపఎన్నికలో పోటీ చేయించాలని వైఎస్సార్ టీవీ భావిస్తోంది.

ముందుగా వైఎస్సార్‌టీపీ మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తుందని అధికారికంగా త్వరలో షర్మిల ప్రకటించనున్నారు. ఆ తర్వాత అభ్యర్ధిని ఖరారు చేయనుున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపాలని షర్మిల భావిస్తున్నారు. అన్ని పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను పోటీలోకి దింపుతున్నాయి. కానీ బీసీ అభ్యర్ధిని పోటీలోకి దించడం ద్వారా ప్లస్ అవుతుందని షర్మిల అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో జరిగిన హూజూరాబాద్ ఎన్నికల్లో షర్మిల పార్టీ పోటీ చేయలేదు. కానీ నిరుద్యోగలతో నామినేషన్లు వేయించినా.. అది పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సారి మునుగోడులో పోటీ చేసి వైఎస్సార్ టీపీ బలం చూపించాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీలు వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కనీసం పార్టీ ఉందనే భావనను ప్రజల్లో కలిగించాలని షర్మిల భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -