Y S Jagan: వైఎస్ షర్మిల కొడుకు వివాహానికి జగన్ హాజరయ్యే ఛాన్స్ లేదా.. కారణాలు ఇవేనా?

Y S Jagan: షర్మిల వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే.. షర్మిల దగ్గర నుంచే మొదలు పెట్టాలి అనేలా మారిపోయాయి. షర్మిల దూకుడు స్వాభావం, మాట తీరు ఆమెను ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు షర్మిలకు సంబంధించి మరో విషయంపై చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. షర్మిల కొడుకు పెళ్లికి ఈ నెల 17న జరగనుంది. రాజస్థాన్‌లో చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని పెళ్లి పనులు చకాచకా పూర్తి చేస్తున్నారు. అయితే, ఈ పెళ్లికి ఏపీ సీఎం జగన్ వె ళ్తారా? వెళ్లారా? ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

మామూలుగా అయితే, చెల్లెల కొడుకు పెళ్లి ఎవరైనా హాజరవుతారు. కానీ, ఈ మధ్య జగన్, షర్మిల మధ్య గ్యాప్ పెరిగింది. ఇద్దరి మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయి. అయినప్పటికీ గత నెల 18న జరిగిన రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి సీఎం జగన్ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. కానీ, అక్కడ ఎక్కువ టైం లేరు. అయితే, నిశ్చితార్థం జరిగిన తర్వాత జనవరి 21న షర్మిల ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె వైసీపీపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. నిజానికి.. చంద్రబాబు, పవన్ కంటే షర్మిల ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. షర్మిల రేంజ్ లో వైసీపీ కౌంటర్స్ ఇవ్వలేక సతమతం అవుతోంది. ఏ ప్రత్యేకహోదా హామీతో జగన్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారో.. అదే ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు షర్మిలకు ఆయుధంగా మారింది. ఇక.. చంద్రబాబు, పవన్ ప్రత్యేకహోదా గురించి మాట్లాడే స్థితిలో లేరు కనుక.. షర్మిల ఒక్కరే హోదాపై గట్టిగా ప్రశ్నింస్తున్నారు. దీంతో, వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

షర్మిల దాటిని తట్టుకోలేక వైసీపీ ఆమెపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగింది. అసలు షర్మిలకు వైఎస్ ఫ్యామిలీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయినా.. షర్మిలా ఎక్కడా తగ్గే పరిస్థితి కనింపించడంలేదు. అంతేకాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగాలోకానికి ఉన్న తేడా ఉందని ఘూటుగా విమర్శలు చేశారు. షర్మిలను బెదిరిస్తున్న వారికి ఆమె తాడో పేడో తేల్చుకుందాం రా అని సవాల్ చేసే వరకూ వెళ్లారు.

ఈ నెల రోజుల్లో జగన్, షర్మిల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీంతో, ఆయన రాజారెడ్డి పెళ్లికి హాజరవుతారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పటి వరకూ సీఎంఓ నుంచి కూడా ఆయన షెడ్యూల్ గురించి ప్రకటన లేదు. రాజకీయాలను రాజకీయంగా మాత్రమే చూసే గుణం జగన్ కు మొదట నుంచి లేదు. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులులా చూస్తారు. జగన్ గురించి బాగా తెలిసిన వాళ్లు రాజారెడ్డి పెళ్లికి ఆయన వెళ్లే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -