Sharmila Son Marriage: చెల్లి కొడుకు పెళ్లికి హాజరు కాని సీఎం జగన్.. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటారంటే నమ్మాలా?

Sharmila Son Marriage: రాజకీయాలను వ్యక్తిగతం అంశాలు కలిపి చూడకూడదు. ఒకప్పుడు అలాగే ఉంటేది. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో సభలో ఉంటే వాతావరణం హాట్‌హాట్‌గా ఉండేవి. కానీ, ప్రైవేట్ మీటింగ్స్‌లో ఇద్దరూ నవ్వుకుంటూ ఉండేవారు. నిజానికి వారిద్దరు మంచి మిత్రులు. రాజకీయాల్లో ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థులుగా మారారే తప్పా.. వారి స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ చంద్రబాబు వైఎస్‌తో ఉన్న ఫ్రెండ్సిప్ గురించి అడపా దడపా చెబుతూ ఉంటారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. రాజకీయాలను, వ్యక్తిగతాన్ని వేరు వేరుగా చూస్తూ అందరిని కలుపుకొని పోయే నైజం వైఎస్‌ది అయితే… జగన్ నైజం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

జగన్ రాజకీయాలతో వ్యక్తిగతాన్ని వేరు చేసి చూడలేకపోతున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి దగ్గర చూడలేదంటే ఓ రకం అనుకోవచ్చు. కానీ, సొంత చెల్లిని కూడా రాజకీయాల నుంచి వేరు చేసి చూడలేకపోతున్నారు. అందుకే షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లికి హాజరుకాలేదు. షర్మిల కొడుకు పెళ్లి ఈ నెల 17న రాజస్థాన్‌లో జరిగింది. విజయమ్మ సహా కుటుంబ సభ్యులంతా ఈ వివాహానికి హాజరైయ్యారు. కానీ, జగన్ మాత్రం హాజరుకాలేదు.

ఈ మధ్య జగన్, షర్మిల మధ్య గ్యాప్ పెరిగింది. ఇద్దరి మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయి. అయినప్పటికీ గత నెల 18న జరిగిన రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి సీఎం జగన్ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. కానీ, అక్కడ ఎక్కువ టైం లేరు. అయితే, నిశ్చితార్థం జరిగిన తర్వాత జనవరి 21న షర్మిల ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె వైసీపీపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. నిజానికి.. చంద్రబాబు, పవన్ కంటే షర్మిల ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. షర్మిల రేంజ్ లో వైసీపీ కౌంటర్స్ ఇవ్వలేక సతమతం అవుతోంది. ఏ ప్రత్యేకహోదా హామీతో జగన్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారో.. అదే ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు షర్మిలకు ఆయుధంగా మారింది. ఇక.. చంద్రబాబు, పవన్ ప్రత్యేకహోదా గురించి మాట్లాడే స్థితిలో లేరు కనుక.. షర్మిల ఒక్కరే హోదాపై గట్టిగా ప్రశ్నింస్తున్నారు. దీంతో, వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

షర్మిల దాటిని తట్టుకోలేక వైసీపీ ఆమెపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగింది. అసలు షర్మిలకు వైఎస్ ఫ్యామిలీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయినా.. షర్మిలా ఎక్కడా తగ్గే పరిస్థితి కనింపించడంలేదు. అంతేకాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగాలోకానికి ఉన్న తేడా ఉందని ఘూటుగా విమర్శలు చేశారు. షర్మిలను బెదిరిస్తున్న వారికి ఆమె తాడో పేడో తేల్చుకుందాం రా అని సవాల్ చేసే వరకూ వెళ్లారు.

ఈ నెల రోజుల్లో జగన్, షర్మిల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీంతో ఆయన రాజారెడ్డి వివాహానికి హాజరుకాలేదు. అయితే, జగన్ తీరుపై వైసీపీలో సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలను పక్కన పెట్టి రాజారెడ్డి వివాహానికి వెళ్తే బాగుండేదని చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -