Munugode By-Poll: పోలీసుల పర్యవేక్షణలో మునుగోడు.. ఎక్కడికక్కడ పోలీసులు

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక పోరు తెలంగాణలో హాట్ హాట్ గా సాగుతోంది. మునుగోడులో పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారాలు, విమర్శలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు ఉపఎన్నికల చుట్టూ తిరుగుతోంది. పార్టీల అధినేతలందరూ అక్కడే మకాం వేశారు. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరికొద్దిరోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో.. ప్రచారహోరును మరింత పెంచాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా.. మొన్నటివరకు కేసులో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు వెనక్కి తగ్గింది.

అయితే మునుగోడు ఉపఎన్నిక పోలింగ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రాసెస్ మొత్తం పూర్తికావడంతో పోలింగ్ కు ఈవీఎంలు, ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, గుర్తులను పొందుపర్చడం లాంటి ఏర్పాట్లు చేస్తోన్నారు. అయితే మునుగోడులో ప్రలోభాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను పార్టీలన్న ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తోన్నాయి. పోటాపోటీగా డబ్బులు పంచుతున్నాయి. ఇటీవల ఒక చోట కోటి రూపాయాలను, ఇంకోచోట 50 లక్షల రూపాయాలతో పాటు అనేక చోట్ల ఓటర్లకు డబ్బులు పంచడానికి తీసుకెళ్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. దీనిని బట్టి చూస్తే మునుగోుడులో ధన ప్రవాహం ఎంతగా సాగుతుందో అర్ధం చేసుకోంది.

దీంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ధన ప్రవాహంపై దృష్టి పెట్టారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేలా కసరత్తు చేస్తోన్నాయి. అయినా ధన ప్రవాహాన్ని కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో మరింత నిఘా పెంచే ప్రయత్నం చేస్తోున్నారు. నల్గగొండ, భువనగిరి పోలీసులందరూ మునుగోడులోనే తిరుగుతున్నారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీ మునుగోడులో పర్యవేక్షిస్తున్నారు. ఇక కేంద్ర బలగాలు సైతం మునుగోడుకు వచ్చాయి. దీంతో మునుగోడు మొత్తం పోలీస్ వలయంలోకి వెళ్లింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసులు భద్రతగా ఉంటున్నారు. మొత్తం 104 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు.

గతంలో జరిగిన అల్లర్లు, గొడవలను పరిగణలోకి తీసుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ సీపీ మహేష్ భగవత్ భత్రతా చర్యలను తీసుకున్నారు. దీంత ోపోలీసులు ఎక్కడక్కడ భారీగా మోహరించారు. మునుగోడులోని చౌటుప్పల్ మండలంలో 400 మంది, సంస్దాన్ నారాయణపురంలో 300 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తుననారు. త్వరలో కేసీఆర్, అమిత్ షాతో సహా కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ బహిరంగ సభలు నిర్వహించనున్న కక్రమంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మునుగోడులో ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ఇక్కడే ఉండనున్నాయి.

ఇక మునుగోడులో 48 సున్నిత పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అక్కడ కూడా భద్రతను పెంచారు. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రతీ పోలింగ్ కేంద్ర వద్ద భారీగా పోలీసులను ఉంచనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -