Munugodu: మునుగోడు ఎన్నిక కౌంటింగ్‎లో టీఆర్ఎస్, బీజేపీకి షాక్!

Munugodu: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో సాగిన మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ కొనసాగుతోంది. తెలంగాణలో ఎంతో ఖరీదైన, ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపు సాధించాలని అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. తాజాగా ఈ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ప్రధాన పోటీ.. బీజేపీ మరియు టీఆర్ఎస్ ల మధ్య సాగుతోంది. అయితే ఈ ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చేలా ఓటర్లు స్వతంత్రులకు ఓట్లు గుద్దారు. దీంతో అన్ని పార్టీలు తమ ఓట్లు ఎక్కడ చీలుతాయో అనే డైలమాలో ఉన్నాయి. కాగా మునుగోడులో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు.. మునుగోడు బరిలో నిలిచిన చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ కు 104 ఓట్లు, చెప్పుల గుర్తు గాలయ్యకు 157 ఓట్లు, ఉంగరం గుర్తు కేఏ పాల్ కు 34 ఓట్లు, రోడ్డు రోలర్ గుర్తు శివకుమార్ కు 84 ఓట్లు వచ్చాయి. వీటికి తోడు నోటాకు కూడా ఓట్లు వచ్చాయి. మునుగోడు బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి ఇప్పటి వరకు దాదాపు వెయ్యి ఓట్ల వరకు సొంతం చేసుకున్నాడు.

దీంతో తమ ఓట్లకు ఎక్కడ గండిపడుతుందో అని అన్ని పార్టీల అభ్యర్థులు భయపడుతున్నారు. తమ మెజార్టీతో పాటు గెలుపోటములను ఈ ఓట్లు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నట్లు అభ్యర్థులు హడలిపోతున్నారు. మొత్తానికి స్వతంత్రులు మునుగోడు బరిలోని అసలు పార్టీ అభ్యర్థులకు చమటలు పట్టిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -