Murali Mohan: వైరల్ అవుతున్న మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు!

Murali Mohan: తెలుగు సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత అయిన మురళీమోహన్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించి హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. కేవలం హీరో గానే కాకుండా నటుడిగా కూడా మనిషి గుర్తింపు తెచ్చుకున్నారు మురళి మోహన్.

అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే ఖాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. నేను 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేను బిజినెస్ చేసుకుంటున్నా సమయంలో సినిమాలో అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నాను. అలా దాదాపు మూడేళ్ల పాటు బిజినెస్ అలాగే సినిమాల్లో నటించాను. ఆ తర్వాత సినిమా లైఫ్ బాగుంది అనిపించింది.

 

దాంతో బిజినెస్ ని వద్దు అనుకున్నాను. ఇక హీరోగా నటిస్తున్న సమయంలో చాలామంది హీరోయిన్లు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. కానీ అప్పటికే నాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో నాకు అలాంటి అలవాట్లు లేవు మేడం సారీ అని చెప్పేసే వాడిని. కానీ నేను ఏ ఒక్కరితో కూడా ప్రేమలో పడలేదు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ వయసులో మరొకరిని పెళ్లి చేసుకోవడం నా భార్యకు విడాకులు ఇవ్వడం చేస్తే మోసం చేయడం అవుతుంది. ఇక నన్ను సినిమా ఇండస్ట్రీకి దాసరి గారు నా ఫ్యామిలీ నా పిల్లలు నా కుటుంబ సభ్యులు చాలామంది నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు. బ్రతికినంత కాలం నేను గొప్పగా బతికాను అని చెప్పుకోవాలి కానీ ఇలా ఒకరి నన్ను నిందించే విధంగా ఉండకూడదు అని అనుకున్నాను తెలిపారు మురళీమోహన్. ఈ జనరేషన్ వాళ్ళు పెళ్లిళ్లు విడాకులు ప్రేమలు అవుతున్నాయి కదా సార్ మీ అభిప్రాయం ఏంటి అని అనగా మా కాలంలో ఇలాగ లేదు ఈ జనరేషన్ తగ్గట్టుగా ఈ జనరేషన్ లో ఉన్నారు. ఒకవేళ నేను కూడా పెళ్లి కాకముందు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకునే వాడినేమో అని తెలిపారు మురళీమోహన్. ఇండస్ట్రీలో రెండో పెళ్లి మూడో పెళ్లి ఇలాంటివన్నీ ఉండకూడదు అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -