Duniya Vijay: ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నా పాత్ర అదే: దునియా విజయ్

Duniya Vijay: సినిమాలకు భాష అడ్డు రాదని ఎన్నోసార్లు నిరూపితమైంది. ట్యాలెంట్ ఉన్న నటీనటులు ఉంటే ఏ భాషలో అయినా నటించి తమ ట్యాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరచగలరు. ఇలా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న మరో ట్యాలెంటెడ్ నటుడి పేరు దునియా విజయ్. కన్నడలో తన ట్యాలెంట్ ను నిరూపించుకున్న ఈ నటుడు ఇప్పుడు తెలుగులో బాలయ్య సినిమాతో అడుగుపెడుతున్నాడు.

 

గోపిచంద్ మలినేని, నందమూరి బాలయ్య కాంబోలో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాతో దునియా విజయ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. కన్నడలో ఎన్నో విజయాలను చూసిన దునియా విజయ్.. తొలి తెలుగు సినిమా మీద భారీ అంచానాలను పెట్టుకున్నాడు. ఈ సినిమా అదిరిపోతుందని అతడు పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. మీడియాతో తన సినీ ప్రస్థానం గురించి దునియా విజయ్ పలు విషయాలను పంచుకున్నాడు.

 

దునియా విజయ్ తన తల్లి మరణం గురించి మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులే నా దేవుళ్లు. వారి ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కు ముందు అమ్మానాన్న ఇద్దరూ చనిపోయారు. ఈ సినిమా చూడకుండానే నా తల్లి మరణించారన్న బాధ ఉంది’ అని అన్నాడు. ఇక తనకు దునియా విజయ్ అనే పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా అతడు వివరిస్తూ.. ‘దునియా సినిమా మధ్యలో ఆగిపోతే నేను రూ.12లక్షలు ఇచ్చాను. అప్పుడు ఇంట్లో వాళ్లతో గొడవపడి మరీ ముందడుగు వేశాను. చివరికి సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా నా ఇంటి పేరుగా మారిపోయింది’ అని వివరించాడు.

 

ఇక తెలుగులో అవకాశం రావడం గురించి దునియా విజయ్ మాట్లాడుతూ.. ‘మొదట తెలుగులో లవకుశ సినిమా ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు కన్నడలో బిజీగా ఉండి చేయలేకపోయాను. తర్వాత గోపిచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’ సినిమా గురించి సంప్రాదించాడు. ముసలిముడుగు ప్రతాప్ రెడ్డి రోల్ చేయాలన్నారు. ఆ రోల్ గురించి చెప్పగానే ఓకే చెప్పేశా. ఎప్పుడెప్పుడు పాత్ర చేయాలా అని ఎదురు చూశాను. సినిమా అదిరిపోతుంది’ అని పేర్కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -