Naga Chaitanya: టాలెంట్ బట్టి డిమాండ్ ఉంటుంది: నాగచైతన్య

Naga Chaitanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది నెపోకిడ్స్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే చాలామందికి నెపో కిడ్స్ గురించి మాట్లాడుతూ.. వారు సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రావడం వల్లే వారికి అవకాశాలు వస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ ఉన్నప్పటికీ ఈ వార్తలు మాత్రం సినీ ఇండస్ట్రీలో వినపడుతూనే ఉంటాయి.

ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో వారసులు వారసురాలు ఈ విషయంపై స్పందిస్తూ కేవలం నేపో కిడ్ అయితే మాత్రమే అవకాశాలు రావని ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ నెపోటిజం పై నటుడు నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తన తాత తండ్రి ఇద్దరు నటలు కావటం వల్లే తనకు నటనపై ఆసక్తి వచ్చిందని, ఈ ఆసక్తి కారణంగానే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.

నా తాత తండ్రిని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలలోకి వచ్చాను. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇప్పటికీ కష్టపడుతున్నానని ఇంకా కష్టపడుతూనే ఉంటానని నాగచైతన్య వెల్లడించారు.ఇక తనతో పాటు మరొక సెల్ఫ్ మేడ్ హీరో సినిమా ఒకేసారి విడుదలై నా సినిమా 10 కోట్లు సెల్ఫ్ మేడ్ హీరో సినిమా 100 కోట్లు వసూలు రాబడితే నేను నెపోకిడ్ అని దర్శకులు నిర్మాతలు తన వద్దకు రారని అందరూ కూడా 100 కోట్లు రాబట్టిన సెల్ఫ్ మేడ్ హీరో వైఫై వెళ్తారని ఈయన తెలిపారు.

ఇండస్ట్రీలో కొనసాగాలన్న పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలన్న నెపోకిడ్ అయితే అలాంటి పేరు ప్రఖ్యాతలు రావని టాలెంట్ ఉన్నవాళ్లకి అవకాశాలు వస్తాయని టాలెంట్ బట్టి ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుందని ఈ సందర్భంగా ఈయన నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఇక ఇలాంటి మాటలపై తనకు ఏమాత్రం నమ్మకం లేదంటూ నాగచైతన్య ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఇలా నెపోటిజం గురించి నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈయన సినిమాల విషయానికొస్తే తాజాగా థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. అలాగే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా మొదటిసారి ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఇక్కడ కూడా తీవ్ర నిరాశ ఎదురైంది.ఇక తన తదుపరి సినిమాల విషయానికొస్తే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్వి భాషా చిత్రంలో నటిస్తున్నారు.అలాగే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మొదటిసారిగా దూత అనే వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగటివ్ పాత్రలో సందడి చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -