Samantha-Naga Chaitanya: సమంతపై ప్రేమ కురిపించిన నాగచైతన్య.. ఆమె దేవతంటూ?

Samantha-Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ జంట విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తున్నా కూడా విడాకులకు గల కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు వెల్లడించలేదు. అంతేకాకుండా విడాకుల తర్వాత స్నేహితులుగా ఉంటాము అని చెప్పిన నాగచైతన్య, సమంత ఎవరితో ఎవరికీ పరిచయం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కనీసం పుట్టినరోజుకు కూడా విషెస్ చెప్పుకోవడం లేదు. అయితే సమంత నాగచైతన్యలకు చాలా సందర్భాలలో వారి విడాకుల కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

కానీ ఎప్పటికప్పుడు వాటిని దాటి వేస్తూ వచ్చారు సమంత చైతన్య. ఇది ఇలా ఉంటే తాజాగా నాగచైతన్య మొట్టమొదటిసారి సమంత గురించి స్పందించారు. నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ. మే 12 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నాగచైతన్య సమంత గురించి మాట్లాడుతూ.. నేను సమంత విడిపోయి రెండేళ్లు అవుతోంది. చట్టప్రకారం మేము విడాకులు తీసుకుని ఏడాది పూర్తి అవుతోంది. న్యాయస్థానం కూడా మాకు విడాకులను మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో సాఫీగా ముందుకు సాగిపోతున్నాము.

 

మా లైఫ్‌ లోని ప్రతి దశను నేను గౌరవిస్తున్నాను. సమంత చాలా మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అంతా బాగానే ఉంది కానీ సోషల్‌ మీడియాలో వచ్చిన కొన్ని వదంతుల వల్లే మా మధ్య టర్మ్స్‌ ఇబ్బందికరంగా మారాయి. మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు జనాల్లోకి వెళ్లింది. ఇది నన్ను ఎంతగానో బాధపెట్టింది. మరో చెత్త విషయం ఏమిటంటే.. నాతో ఎటువంటి సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగారు. దాంతో సదరు వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యింది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత జీవితం పై పలువురు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకుండా అలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడిని. కాకపోతే ఇప్పటికీ వాళ్లు నా పెళ్లి, విడాకుల గురించే ఎందుకు మాట్లాడుతున్నారో, వదంతులు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు నాగ చైతన్య.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -