Naga Chaitanya: మరో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. సమంతకు చెక్ పెట్టే హీరోయిన్ ఆమేనా?

Naga Chaitanya: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి మనందరికీ తెలిసిందే. మన్మధుడు కింగ్ అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరో హోదాను దక్కించుకున్నారు నాగ చైతన్య. అయితే ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోలు ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలు అంతగా కలిసి రావడం లేదు. ఇంకా చెప్పాలంటే నటించిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ గానే నిలుస్తున్నాయి. ఇక హీరో నాగచైతన్య సమంతకు ఏ ముహూర్తాన విడాకులు ఇచ్చారో కానీ అప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీకు అసలైన శని మొదలైంది.

ఇక అప్పటినుంచి అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి వార్తలు అయినా కూడా అక్కినేని హీరోలను తిట్టిపోస్తున్నారు. అయినా కానీ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఇంటికి పునర్వైభవం తీసుకురావాలని నాగార్జున నాగచైతన్యకు మళ్ళీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. గత కొంతకాలంగా శోభితా ధూళిపాలతో ఈ హీరో ప్రేమాయణం నడుపుతున్నాడు అని రెండో భార్యగా నాగచైతన్య ఫిక్స్ చేసుకున్నాడు అని వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జంట చాలా సార్లు కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.

 

కానీ ఇప్పటివరకు ఆ వార్తలపై అటు నాగ చైతన్య కానీ ఎటు శోభిత ధూళిపాల కానీ స్పందించడం లేదు. దీంతో వార్తలన్నీ కూడా అవాస్తవాలే అని తేలిపోయింది. నాగార్జున తన ఫ్రెండ్ కూతుర్ని నాగచైతన్య కి పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఆమెకు ఇండస్ట్రీలో అస్సలు సంబంధం లేదని, ఇండస్ట్రీలో సంబంధం లేని వ్యక్తితోనే నాగచైతన్య పెళ్లి చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అంటూ నాగార్జున ఈ పెళ్లికి ఓకే చెప్పినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నాగ చైతన్య పెళ్లి రూమర్ వైరల్ గా మారింది. ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అక్కినేని ఫ్యామిలీ స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -