Nagarjuna-Jr NTR: అందరి ముందు ఎన్టీఆర్ ని ఏడిపించేసిన నాగార్జున!

Nagarjuna-Jr NTR:  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రణ్ బీర్ కపూర్, అలియా భట్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రస్టార్ నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఊహించని స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందీ తో పాటు తమిళ, తెలుగు, కన్నడ మలయాళ, భాషల్లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయింది.

కాబట్టి పార్కు హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున ఈ సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. మొట్టమొదటిగా తను మాట్లాడుతూ ఎన్టీఆర్ తండ్రి అయినటువంటి హరికృష్ణ పుట్టినరోజు గురించి గుర్తు చేశాడు. ఈ మాటతో ఎన్టీఆర్ కు తన తండ్రిని గుర్తు చేసినట్లుగా అయింది.

అందరి ముందు నాగార్జున హరికృష్ణను తలుచుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దాంతో కొంతవరకు ఎన్టీఆర్ ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత నాగార్జున ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్లు తెలిపారు. ఇక డైరెక్టర్ అయాన్ ను నాగార్జున తను చాలా టాలెంటెడ్ పర్సన్ అని పొగిడాడు.

అంతే కాకుండా ఈ ఈవెంట్లో తను లేకపోవడం తో నేను చాలా మిస్ అవుతున్నాను అన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హడావిడిగా మారింది. మరి ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎమోషన్ మీరు కూడా చూసేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -