Nagarjuna: జగన్ పార్టీలోకి నాగార్జున? అక్కడ నుంచి పోటీలోకి దిగుతారా?

Nagarjuna: నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ బట్టినా ఓ వార్త వైరల్ గా మారుతోంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అదే వార్త కనిపిస్తోంది. అది ఏంటంటే.. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున వైసీపీలో చేరబోతుందట. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆయన విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారట. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పుడే ఎందుకు ఈ వార్త బయటకు వచ్చింది.. ఇప్పుడే ఎందుకు దీనిని వైరల్ చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. నాగార్జున సీనియర్ హీరో కావడంతో అందరూ ఈ న్యూస్ ను షేర్ చేస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్ తో పాటు వైఎస్ ఫ్యామిలీతో నాగార్జునకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో నాగార్జున వైసీపీలో చేరడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల ముందు కూడా సేమ్ టూ సేమ్ ఇదే ప్రచారం జరిగింది. నాగార్జున వైసీపీలో చేరతారని, విజయవాడ ఎంపీగా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది అవాస్తమవని తేలిపోయింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్త నిజం కాదనే భావనలో అందరిలో ఏర్పడుతుంది.

ప్రస్తుతం నాగార్జున సినిమాలతో పాటు బిగ్ బాస్ లాంటి షోలో హోస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు. నాగార్జున అనగానే పక్కా బిజినెస్ మెన్ అని అందరూ చెబుతారు. వ్యాపార కోణంలోనే ఏ పనైనా చేస్తారని అంటూ ఉంటారు. లాభం లేకుండా ఏ పని చేయరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా నాగార్జున ఉన్నారు. జగన్ తో వ్యాపారపరంగా నాగార్జునకు సంబంధాలు ఉన్నాయి. అంతేకానీ రాజకీయపరంగా జగన్ తో ఎలాంటి సంబంధాలు లేవు.

అంతేకాకుండా నాగార్జునకు రాజకీయలంటే అసలు పడవు. రాజకీయాలపై ఆయనకు అసలు ఆసక్తి లేదు. రాజకీయాలపై ఆసక్తి ఉందని నాగార్జున చెప్పిన దాఖలు ఎప్పుడూ లేవు. దీంతో నాగార్జున వైసీపీలో చేరుతారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఉట్టి ఫుకార్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ జగన్ తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉండటం, అక్కినేని ఫ్యామిలీ సొంత జిల్లా కూడా కృష్ణా జిల్లానే కావడంతో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారాన్ని కొంతమంది తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

వైసీపీ పార్టీ స్థాపించిన తర్వాత వచ్చిన 2014,2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానంలో వైసీపీ పరాజయం పొందింది. ఇక్కడ వరుసగా టీడీపీ గెలుస్తూ వస్తోంది. కానీ టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టాలనే వ్యూహంతో జగన్ అడుగులు వేస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న చోటనే ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో దెబ్బతీయాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పం, మంగళగిరిపై జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టడానికి కారణం అదే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. రాష్ట్రంలో టీడీపీ కంచుకోటలు ఎన్ని ఉన్నాయో.. ఎక్కడ బలంగా ఉందో జగన్ కొన్ని నియోజవకర్గాలను గుర్తించారు. ఆ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

అందులో భాగంగానే టీడీపీ కంచుకోటగా ఉన్న విజయవాడ పార్లమెంట్ స్థానంపై జగన్ గురి పెట్టారు. గతంలో ఇక్కడ నుంచి వైసీపీ తరపున ప్రముఖ వ్యాపారవేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్ 2014 ఎన్నికల్లో, ప్రసాద్ వి పోట్లూరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వారిద్దరు వ్యాపారవేత్తలు కావడం, ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఓడిపోయారు. వారిద్దరికి జనాలతో ఎలాంటి కనెక్టివిటీ లేదు. దీంతో వైసీపీ పరాజయం పాలైంది. కానీ ఈ సారి నాగార్జునను నిలబెడితే గెలిచే అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ నాగార్జునకు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలనే ఆసక్తి లేదు. దీంతో సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమేనని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -