Nagarjuna: నాగార్జున ఇలాంటి వ్యక్తా.. ప్రముఖ లాయర్ ఏమన్నారంటే?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా బాల నటుడిగా నటించిన నాగార్జున అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయ్యారు.ఇప్పటికి నాగార్జున వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 

ఇక సినిమాలలో నాగార్జున చాలా రొమాంటిక్ గా, సరదాగా కనిపిస్తారు.కానీ నిజ జీవితంలో మాత్రం నాగార్జునకు చాలా టెంపర్ ఉందని ఆయనకు తల పొగరు ఎక్కువ అని తాజాగా ప్రముఖ లాయర్ కలానిది గోపాలకృష్ణ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన నాగార్జున నిజస్వరూపం బయట పెట్టారు.

 

ఈ క్రమంలోనే లాయర్ కళానిధి గోపాలకృష్ణ మాట్లాడుతూ నాగార్జునకు కార్ల పిచ్చి చాలా ఉంది మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వస్తే తప్పనిసరిగా అది తన గ్యారేజ్లో ఉండాలని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం ఈయన డిస్కౌంట్ కావాలంటు అడిగేవారని అలాగే తన కారు నెంబర్లు అన్నీ కూడా 1111 నంబర్ తోనే రిజిస్ట్రేషన్ అయి ఉంటాయని గోపాలకృష్ణ తెలిపారు.

 

ఇక తెరపై ఎంతో సరదాగా హుందాగా కనిపించే నాగార్జున వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా పొగరు మనిషి అని తెలిపారు.ఒకరోజు ఒకే స్టూడియోలో మా ఇద్దరికీ వేరువేరు షూటింగులు ఉన్నాయి. అయితే తన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనతో కలిసి ఒక ఫోటో దిగాలని తన పిఎ ద్వారా చెప్పి పంపించాను.ఇలా నాగార్జున గారి కోసం అరగంట వరకు వెయిట్ చేశాను అయితే ఆయన షూట్ అయిపోగానే కారవాన్ లోకి వెళ్లి కూర్చున్నారు.

 

కేరవాన్ లో ఉన్నప్పుడు దాదాపు అరగంట వరకు వెయిట్ చేశాను కానీ ఆయన మాత్రం తనతో ఫోటో దిగడానికి రాలేదని తనకు చాలా పొగరు అంటూ గోపాలకృష్ణ నాగార్జున గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెరపై ఎంతో సరదాగా మన్మధుడుగా కనిపించే నాగార్జున నిజ జీవితంలో ఇలా ఇతరుల పట్ల ఇంత పొగరుగా ప్రవర్తిస్తారా అని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -