Nagarjuna: మరోసారి చైతూ, సామ్ ల విడాకుల పై నాగార్జున సంచలన వ్యాఖ్యాలు!

Nagarjuna: నాగచైతన్య, సమంత అంటే తెలియని వారుండరు. ఏం మాయ చేసావే సినిమాతో ఇద్దరు పరిశ్రమకు పరిచయమై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తిరుగులేని స్టార్స్ గా మారారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం రాణిస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇక సమంత, నాగ చైతన్య ల జంట ఈ మధ్య ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ తమ మొదటి సినిమాతోనే పరిచయమై.. ప్రేమించుకొని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నప్పటి నుంచి ఈ దంపతులు చాలా ప్రేమగా ఉన్నారు.

వీరి పెండ్లి జరిగి సరిగ్గా నాలుగు సంవత్సరాలకు ఏమైందో ఏమో.. ఎవరికి తెలియదు.. సమంత, నాగచైతన్య ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట విడాకులు తీసుకొని 11 నెలలు కావస్తున్నా విడాకులు తీసుకోవడానికి గల కారణం సరిగ్గా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ జంట విడాకులపై కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ జంట విడాకులకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. అయితే వీరిద్దరూ అధికారికంగా స్వతంత్రంగానే విడిపోతున్నామని తేల్చి చెప్పేశారు. ఇక వీరి విడాకులపై ఇప్పటికే నాగార్జున గారిని మీడియా ఎన్నో ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు తగ్గట్టు జవాబు ఇస్తూ వచ్చారు నాగార్జున. ఇక బ్రహ్మాస్త్ర సినిమా కు సంబంధించి ఆయన ముంబైకి వెళ్లారు.

బాలీవుడ్ మీడియాతో చైతూ, సామ్ ల విడాకుల గురించి నాగార్జున సంచలన వ్యాఖ్యలు..

ముంబైలో బాలీవుడ్ మీడియా నాగార్జున ని మరోసారి సమంత, నాగచైతన్యల విడాకుల గురించి ప్రశ్నించింది. నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం నాగచైతన్య ఆనందంగా ఉన్నాడు. తండ్రి గా నాకు ఆ విషయం హ్యాపీగా ఉంది. విడాకుల విషయం మా జీవితాల నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది. అందరి జీవితాల్లో నుంచి కూడా వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను అని తేల్చి చెప్పేశారు నాగార్జున. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -