Namrata Shirodkar: మహేష్ నాతో అస్సలు మాట్లాడేవాడు కాదు.. నమ్రత షాకింగ్ కామెంట్స్!

Namrata Shirodkar: తెలుగు ప్రేక్షకులకు ప్రిన్స్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయంకర్లేదు. రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్. ఆపై పలు సినిమాల్లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. దాదాపు నాలుగు పదులు వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

మహేష్ కి లేడి ఫాలోయింగ్ కూడా చాలా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా మహేష్ సినిమా ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే నమ్రత గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మహేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

అదేమిటంటే మొదట్లో మహేష్, నమ్రత లు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు. మహేష్ నమ్రత తో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడట. అలా అందరితో మాట్లాడకుండా చాలా మౌనంగా ఉండేవాడట. ఇక నమ్రత మహేష్ లో ఆ మౌనాన్ని బ్రేక్ చేసిందట. అప్పటినుంచి మహేష్ నమ్రతతో కలివిడిగా మాట్లాడేవాడని నమ్రత ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో యూట్యూబ్లో వైరల్ గా మారింది.

ఇక మహేష్ బాబు రాబోయే సినిమాల విషయానికొస్తే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 23న థియేటర్లో విడుదల అవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రెండు ప్రాజెక్టులతో మహేష్ ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి. సర్కారు వారి పాట సినిమాతో మాత్రం మహేష్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -