Namrata – Manjula: మంజులకు పిల్లల్ని కనడం ఏ మాత్రం ఇష్టం లేదు.. కానీ?

Namrata – Manjula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు, మంజుల. మంజుల పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమె ఇండస్ట్రీలో పెద్దగా కొనసాగలేదని చెప్పాలి. ఇక మహేష్ బాబు మాత్రం కృష్ణ వారసుడిగా తన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఇక మహేష్ బాబు నటి నమ్రతను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

నమ్రత సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇక నమ్రత మహేష్ బాబు ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో అప్పట్లో కృష్ణ వీరి పెళ్లికి ఒప్పుకోలేదని వార్తలు కూడా వినపడుతుంటాయి. ఇక పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన ఆడపడుచు మంజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంజులను తాను ఒక పార్టీలో కలిశానని అయితే అప్పటికి తాను మహేష్ ప్రేమించుకుంటున్న విషయం తనకు తెలియదని తెలిపారు.

అనంతరం తమ ప్రేమ విషయం తెలిసిన తర్వాత తమ పెళ్ళికి మంజుల ఎంతో సపోర్ట్ చేశారని ఈ సందర్భంగా నమ్రత వెల్లడించారు. అలా ఈమె మా ఫ్యామిలీ కావడమే కాకుండా తనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని ఈ సందర్భంగా మంజుల గురించి నమ్రత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే తనకు పెళ్లయిన తర్వాత పిల్లల్ని కనడం ఏ మాత్రం ఇష్టం లేదని, అనుకోకుండా తను నేను ఇద్దరం ఒకేసారి గర్భవతి కావడం పిల్లల్ని కనడం జరిగిందని నమ్రత వెల్లడించారు. ఇలా పిల్లల్ని కనడం ఇష్టం లేనటువంటి మంజుల ఒక బిడ్డకు తల్లి అయి ప్రస్తుతం తన కూతురితో ఎంతో సంతోషంగా గడుపుతుందని నమ్రత ఈ సందర్భంగా మంజుల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -