Nandamuri heros: అలాంటి పాత్రల్లో నందమూరి హీరోలు మాత్రమే నటించగలరా?

Nandamuri heros: నందమూరి తారక రామారావు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన గొప్ప నటుడు, ప్రజా నాయకుడు. తెలుగు ప్రజలు ‘అన్నగారు’ అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీఆర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400ల చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రాల్లో నటించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రజల హృదయాలలో దైవంగా నిలిచారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలో తెలుగు సినీ పరిశ్రమలో మొదటగా పౌరాణిక సినిమాలు మాత్రమే కనిపించేవి. అప్పుట్లో సినిమాలు తీయడానికి ఎన్నో నెలలు పట్టేవి. వీడియో ఎడిటింగ్ కోసం కూడా ఎంతో శ్రమించేవారు. షూటింగ్ సెట్స్ ఏర్పాటులోనే కష్టపడేవారు.

 

 

కానీ, ప్రస్తుతం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు జరిగాయి. సీనియర్ నటుల మనవళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో పౌరాణిక నాటకాలు కనుమరుగయ్యాయి. ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు తీసే సత్తా ఎవరికీ లేదనే చెప్పవచ్చు. ఒక్క నందమూరి ఫ్యామిలీకి తప్పా. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు ఈ మధ్య కాలంలో పౌరాణిక నాటకాలతో అలరించారు. ఎన్టీఆర్.. యమదొంగ, లవకుశ వంటి సినిమాల్లో పౌరాణిక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగేశాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరోలు పౌరాణిక నాటకాల్లో నటించేంత ఉండదు. వారి బాడీ ల్యాంగ్వేజీకి సెట్ కాదు. కానీ కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే సాధ్యం. ఇతర హీరోలు ఈ దిశగా అడుగులు కూడా వేయడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -