Chandrababu – Revanth : చంద్రబాబు, రేవంత్ మధ్య రహస్య భేటీ.. టీడీపీ గెలుపుకు ఆయన సహకరిస్తారా?

Chandrababu – Revanth: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు కోసం ఈయన ఢిల్లీ పయనమయ్యారు. అయితే ఈ ఢిల్లీ ప్రయాణంలో బేగంపేట ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్య భేటీ అయ్యారు దాదాపు రెండున్నర గంటలపాటు వీరు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడు ఇద్దరు రహస్య భేటీ జరపడం వెనక కారణమేంటనే విషయం రాజకీయ చర్చలకు దారి తీసింది.

త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా అయినా వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దించడం కోసం అన్ని పార్టీలు ఏకమై ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్నారు అయితే బిజెపి కూడా పొత్తు కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డిని సునాయసంగా ఓడించవచ్చు అన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈ పొత్తు కోసమే ఈయన ఢిల్లీ వెళ్తున్నారు.

మరోవైపు తెలంగాణ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీతో బిజెపి కుమ్మక్కైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు నాయుడుని రేవంత్ రెడ్డి కలవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే గత ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి గెలుపుకు ఎంతగానో దోహదపడ్డారు. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో చంద్రబాబునాయుడు గెలుపుకు తన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారని తెలుస్తుంది. మరి కొద్ది రోజులలో ఎన్నికలు కోడ్ రాబోతున్నటువంటి తరుణంలో అందకముందే వచ్చే ఎన్నికలలో ఏపీకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అనే విషయం గురించి ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా సుదీర్ఘ చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇలా రేవంత్ రెడ్డి తోడైతే చంద్రబాబు విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -