Nandamuri: పాపం కళ్యాణ్ రామ్.. మరో వింత సమస్య వచ్చిందే?

Nandamuri: సక్సెస్‌తో సంబంధం లేకుండా నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నారు. కొత్త కాన్సెఫ్ట్ లు, స్టోరీలతోపాటు దర్శకులు, టెక్నీషియన్లకు అవకాశాలు ఇస్తున్నారు. సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామా ‘బింబిసార’లో హీరోగా కళ్యాణ్ రామ్ నటించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఫ్లాపుల్లో కొనసాగిన కళ్యాణ్‌ రామ్ కెరీర్.. ఇప్పుడు ఫుల్ జోష్‌గా ముందుకు సాగుతోంది. బింబిసార సక్సెస్ తర్వాత కళ్యాణ్ రామ్ రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డితో కలిసి ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీతోపాటు కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమాలో నటిస్తున్నాడు.

 

నవీన్ మేడారం దర్శకత్వంలో ‘డెవిల్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించనున్నారు. 1945 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ కొనసాగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ జిమ్‌లో భారీగా వర్కౌట్స్ చేస్తున్నాడు. పూర్తిగా డెవిల్ లుక్‌లో మారిపోయాడు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ సమస్య తలెత్తినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట్లో యుక్తని అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడం.. ఆమె స్థానంలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ను ఫైనలైజ్ చేశారు. కానీ బింబిసారలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. దాంతో మరోసారి సంయుక్త మీనన్‌తో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపించడం లేదట. దాంతో ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం. మరి దర్శకుడు ఏ హీరోయిన్‌ను ఫైనల్ చేస్తారో? వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -