Nara Bhuvaneshwari: ఆ జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి గురించి మనందరికీ తెలిసిందే. రాజకీయాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది భువనేశ్వరి. అంతేకాకుండా ఎప్పుడూ కూడా రాజకీయాలలో జోక్యం చేసుకున్న సందర్భం కూడా లేదు. అలాంటిది చంద్రబాబు అరెస్టు తరువాత భువనేశ్వరి మీడియా ముందుకు రావడంతో పాటు చంద్రబాబు ని అరెస్టు చేసిన విషయంపై ఖండించింది. చంద్రబాబు అరెస్టు తరువాత తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది భువనేశ్వరి.

ఇప్పటికే అనేకసార్లు మీడియాతో ముచ్చటించిన భువనేశ్వరి బాబు అరెస్టు పట్ల టీడీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. సానుభూతి కోసం ప్రయత్నించింది అంటూ కూడా వాదనలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా భువనేశ్వరి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన తండ్రి ఎన్టీఆర్‌ జ్ఞాపకాలతో తన హృదయం నిండిపోయిందని నారా భువనేశ్వరి అన్నారు. తెలుగుజాతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
సత్యం ఎంత కఠినంగా ఉన్నా ఎప్పుడూ కట్టుబడి ఉండాలని ఎన్టీఆర్‌ తమకు బోధించారని భువనేశ్వరి గుర్తుచేసుకున్నారు.

న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. తెలుగువారికి సేవ చేయడంలో ఎన్టీఆర్‌ చూపిన అంకితభావం ప్రజలందరితో పాటు ఆయన పిల్లలమైన తమకూ ఆదర్శమని కీర్తించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -