YSRCP: వైసీపీ పదేపదే చేస్తున్న అదే తప్పును ఓటర్లు క్షమిస్తారా?

YSRCP: రాజకీయమన్న తర్వాత వ్యక్తిగత విమర్శలు జరగడం సర్వసాధారణం. ఇలా రాజకీయాలలో ఉండే నాయకులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరితేనే పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే ఇటీవల కాలంలో రాజకీయాలలో జరిగే ఈ విమర్శలు ఎలా ఉన్నాయి అంటే ఆ మాటలతోనే ఒక మనిషిని హననం చేసేలా ఉన్నాయి.

ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు హద్దుమీరి మరి ప్రతిపక్ష నేతల పట్ల విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వారి గురించి మాత్రమే కాకుండా వారి భార్యల ప్రస్తావనను కూడా తీసుకువస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా ప్రతి పక్షనేత అయినటువంటి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పట్ల వైఎస్ఆర్సిపి నేతలు అసభ్యకరంగా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు గురించి విమర్శలు చేసినటువంటి వైసీపీ వాళ్లు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై కూడా ఇలాంటి వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలు మాత్రమే కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైతం సమయం సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువస్తూ ఉన్నారు. అయితే ఇలా ఒక వ్యక్తి పట్ల హద్దు మీరి వ్యక్తిగత దూషణలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో గతంలోనే ప్రజలు ఓట్ల రూపంలో తెలియజేశారు.

1983 లో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని పెళ్లాడిన విషయం అందర్నీ షాక్ కి గురి చేసింది. అయితే అప్పటికి రాజకీయాల్లో సూపర్ ఫాం లో ఉన్న ఎన్టీఆర్ ను కంట్రోల్ చేసే దిశగా కాంగ్రెస్ నేతలు తన రెండో పెళ్లి ప్రస్తావనకు తీసుకువచ్చారు. అయితే ఇది విన్నటువంటి ప్రజలు ఏమాత్రం సహించలేదు. ఒక వ్యక్తి చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా తన రెండో పెళ్లి గురించి ప్రస్తావించడంతో 1994 లో జరిగిన ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుతో బుద్ధి చెప్పి కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉండబోతుందని స్పష్టంగా అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -