TDP First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని ప్రముఖ నేతలు వీళ్లే.. కారణాలు ఇవేనా?

TDP First List: కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని అంటారు. టీడీపీ జనసేన లెక్క అలాగే ఉంది. జగన్ నెలన్నరగా ఏడు జాబితాలు రిలీజ్ చేసి సుమారు 70 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కానీ.. టీడీపీ, జనసేన ఒకేసారి 99 స్థానాలను ప్రకటించింది. షెడ్యూల్ విడుదల కాకపోయినా అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం చేసుకుంటారని చంద్రబాబు స్పీడ్ పెంచారు. కూటమి విడుదల చేసిన జాబితాలో 94 పేర్లు టీడీపీవే ఉన్నాయి. ఇక వారంతా ఎన్నికల రణరంగంలో దిగాల్సిందే. అయితే, టీడీపీతో దశాబ్ధాలుగా ఉన్న చాలా మంది పేర్లు తొలి జాబితాలో లేవు.

టికెట్ రాని నేతల్లో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. అలాగే నిన్న మొన్నటి వరకు పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు. అటు బండారు సత్యనారాయణ పేరు కూడా ఫస్ట్ లిస్టులో కనిపించలేదు. ఇక విజయనగరంలో టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు లేదు. ఆయన టీడీపీలో చాలా సీనియర్ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. టీడీడీ చైర్మన్ గా చేశారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడగా కూడా పని చేశారు. కిమిడి కళా వెంకటరావుతో పాటు.. ఆయన కుటుంబంలో మరొకరికి కూడా ప్రతీసారి కూడా టికెట్ కేటాయిస్తూ వచ్చింది. అయితే, ఈ సారి తొలి జాబితాలో ఒక్కరికి కూడా టికెట్ లేదు.

అటు గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి కూడా టికెట్ రాలేదు. తూర్పు గోదావరి జిల్లాలోనూ పలువురు టీడీపీ సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు. ముఖ్యంగా రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి టికెట్ దక్కలేదు. మరోవైపు రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ – జనసేన మధ్య క్లారిటీ రాలేదు. దీంతో బుచ్చయ్య చౌదరి టికెట్ అంశం హాట్ టాపిక్ గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లు ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్‌కు సీట్లు కేటాయించలేదు. తెనాలి సీటు నాదెండ్ల మనోహర్ కు తెనాలి టికెట్ కేటాయించారు. ఇక పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, వెస్ట్‌ల్లో అభ్యర్ధులను ప్రకటించలేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాత, ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించారు కానీ.. తొలిజాబితలో వారి పేర్లు లేవు.

వీరితో పాటు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్ది, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ, పేర్లను కూడా చంద్రబాబు ప్రకటించలేదు. అయితే.. ఇంకా టీడీపీ 99 స్థానాలు మాత్రమే ప్రకటించింది. చాలా స్థానాలను ప్రకటించాల్సి ఉంది. పూర్తి జాబితా విడుదలైయ్యే సరికి అందరికి న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఒకవేళ పొత్తులో భాగంగా ఎవరైనా సీట్లు త్యాగం చేస్తే వారికి నామినేటడ్ పదవులు కానీ.. ఎమ్మెల్సీలు కానీ ఇస్తామని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -