Nara Lokesh-Brahmani: బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావ‌డం లోకేశ్‌కు ఇష్టం లేదా.. ఆ రీజన్ వల్లే లోకేశ్ వద్దన్నారా?

Nara Lokesh-Brahmani: అదేంటి నిజంగానే నారా లోకేష్ కు బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల సాక్ష్యం నారా లోకేష్ తాజాగా మీడియాతో చేసిన వ్యాఖ్యలే. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త‌న భార్య బ్రాహ్మ‌ణికి రాజ‌కీయాలంటే ఇష్టం లేద‌ని అన్నారు లోకేశ్. కానీ బ్రాహ్మ‌ణి రాజ‌కీయాల్లోకి రావ‌డాన్ని లోకేశ్ ఇష్ట‌ప‌డ‌డం లేద‌నే టాక్ గట్టిగా వినిపిస్తోంది. బ్రాహ్మ‌ణి రాక‌తో రాజ‌కీయాల్లో త‌న‌ను ప‌ట్టించుకోర‌నే భ‌యం లోకేశ్‌ను వెంటాడుతోంద‌నే, అందుకే ఆమె రాకను మొగ్గలోనే తుంచి వేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా స్కిల్ స్కామ్‌లో భాగంగా చంద్ర‌బాబుని అరెస్ట్ చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో పెట్టారు. 23 రోజులుగా ఆయ‌న జైలు జీవితాన్ని గ‌డుపుతున్నారు. జైలు నుంచి బాబు ఎప్పుడు బ‌య‌టికొస్తారో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. బాబు ని వినిపించేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేయగా అందులో ఏ ఒక్కటి కూడా ఫలించలేదు. ఈ సంగతి పక్కన పెడితే మరొకవైపు అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ లోకేశ్‌ను 14వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో నాల్గో తేదీన లోకేశ్ విచార‌ణ ఎదుర్కోనున్నారు. ఏదో ఒక కేసులో లోకేశ్ అరెస్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్పటికే బాబు అరెస్టుతో సగం బలం కోల్పోయిన టీడీపీ నేతలు ఇప్పుడు నారా లోకేశ్ అరెస్ట్ తో పూర్తిస్థాయిలో బలాన్ని కోల్పోనున్నారు అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తండ్రీ కొడుకు ఇద్దరు జైలుపాలైతే టీడీపీని న‌డిపేందుకు బ్రాహ్మ‌ణి తెర‌పైకి వ‌స్తార‌ని ఎల్లో మీడియా ఊద‌ర‌గొడుతోంది. ఒక‌వైపు నేనున్నా, పార్టీని న‌డిపిస్తా అని నంద‌మూరి బాల‌కృష్ణ గ‌ట్టిగా అరుస్తూ చెబుతున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. బ్రాహ్మ‌ణినే స‌రైన లీడ‌ర్ అంటూ మాన‌సికంగా టీడీపీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బ్రాహ్మ‌ణికి రాజ‌కీయాలంటే ఆసక్తి లేద‌ని ఈ స‌మ‌యంలో లోకేశ్ చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Related Articles

ట్రేండింగ్

KCR-Jagan: జగన్ కోసం కేసీఆర్ తాపత్రయం వెనుక అసలు లెక్కలివే.. ఓడితే మునిగినట్టేనా?

KCR-Jagan: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల విషయంలో తెలంగాణలో సైతం పెద్ద ఎత్తున హడావిడి ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల గురించి ఇటీవల బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడుతూ చేసిన...
- Advertisement -
- Advertisement -