Mangalagiri Constituency: మంగళగిరిలో గ్రౌండ్ రిపోర్ట్ అసలు లెక్కలివే.. ఆ రాజకీయ పార్టీకే అనుకూల ఫలితాలా?

Mangalagiri Constituency: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే .ఈయన తన తండ్రి హయాంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే తదుపరి ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీకి దిగారు. అమరావతి పక్కనే ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈయన పోటీ చేయడంతో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతులలో 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఈ విధంగా లోకేష్ ఓడిపోవడంతో ఈసారి వేరే నియోజకవర్గం నుంచి కాకుండా తాను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే విజయకేతనం ఎగురవేసి చూపించాలన్న కసితో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుంచి మంగళగిరిలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ అక్కడ ప్రజల అవసరాలను తీరుస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నారు. అయితే ఈ ఎన్నికలలో తాను గెలవడం ముఖ్యం కాదని 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ముఖ్యమని టార్గెట్ లోకేష్ పెట్టుకున్నారు.

ఇలా మంగళగిరి గెలుపు పై లోకేష్ ధీమాగా ఉన్న ఆయనకు కాస్త చిక్కుముడులు కూడా ఉన్నాయని తెలిసింది. లోకేష్ కి పోటీగా మురుగుడు లావణ్యను నియమించారు. ఈమె స్థానిక బిసి మహిళా అంతేకాకుండా ఇక్కడ చేనేత వర్గానికి చెందినటువంటి వారు అలాగే బీసీ వర్గానికి చెందినవారు ఓట్లు భారీ స్థాయిలో ఉన్నాయి దీంతో ఈమెకు అధికాస్త అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

టీడీపీ విషయం చూసుకుంటే ఎపుడో 1985లో ఆ పార్టీ చివరిసారిగా గెలిచింది. అంటే దాదాపుగా నలభై ఏళ్ల తరువాత ఇపుడు టీడీపీ గెలిస్తే మాత్రం ఆ క్రెడిట్ లోకేష్ దే అని అంటున్నారు. ఇక్కడ లోకేష్ కి స్థానిక అభ్యర్థితో పోటీకి అంటే కాస్త టాప్ ఉన్నప్పటికీ కాపులు అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం జనసేన పొత్తు ఉండటం వల్ల ఆ ఓట్లు కాస్త టీడీపీ వైపు మళ్ళితే లోకేష్ విజయం పక్కా అని చెప్పాలి. ఈసారి భారీ మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి లోకేష్ కి మంగళగిరి ప్రజలు ఎలాంటి మెజారిటీని ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -