YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మాట. నాకు ఆస్తులు లేవు. నా వెనుక మీడియా లేదు. వైసీపి అభ్యర్ధులందరూ కూడా పేదవాళ్ళే. వాళ్ళ ఆస్తులు అంతంత మాత్రమే అంటూ పరిచయం చేస్తున్నారు. మంగళగిరి వైసీపి అభ్యర్ధి మురుగుడు లావణ్యని నియోజకవర్గం ప్రజలకు పరిచయం చేస్తూ నారా లోకేష్‌తో పోలిస్తే ఆమెకు పెద్దగా ఆస్తులు లేవని జగన్‌ చెప్పడం కాస్త కామెడీగా అనిపిస్తోంది. ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు.

వారి కుటుంబం ఆర్ధికంగా, రాజకీయంగా చాలా బలంగా ఉంది కనుకనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని, గంజి చిరంజీవిని పక్కన పెట్టి ఆమెను అభ్యర్ధిగా ప్రకటించారని అందరికీ తెలుసు. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే డబ్బు ఖర్చు పెట్టగల ధైర్యం ఉంది అంటేనే ఎంట్రీ ఇస్తారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎన్నికలలో పోటీ చేయాలంటే అన్ని పార్టీలు ముందుగా చూసేది కూడా ఇదే. పిఠాపురంలో తనను ఓడించేందుకు వైసీపి రూ.100, 150 కోట్లు ఖర్చు చేయబోతోందని పవన్‌ స్వయంగా చెప్పారు. కనుక ఎన్నికలు ఇంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి కనుకనే ఆషామాషీ రాజకీయ నాయకులు ఎవరూ ఎన్నికలలో పోటీ చేయలేరు.

ఒకవేళ అలా పోటీ చేసిన కూడా గెలవలేరు. కాబట్టి వైసీపి అభ్యర్ధులు పేదవారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మూడు నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకునేవారు పేదవాళ్ళయితే, సామాన్య ప్రజలు, నిరుపేదలు ఎవరు? నారా లోకేష్‌ తాను పేదవాడినని ఎన్నడూ చెప్పుకోలేదు. కోటీశ్వరుడైనప్పటికీ ఏనాడూ ఆ అహంభావం ప్రదర్శించరు. నారా కుటుంబం హెరిటేజ్ డైరీతో సహా విజయవంతంగా నడుస్తున్న పలు వ్యాపారాలున్నాయి. కనుక ఖచ్చితంగా ధనవంతులే. కానీ వైసీపిలో నారా లోకేష్‌ కంటే చాలా భారీగా ఆస్తిపాస్తులున్న వారు కోకొల్లలు ఉన్నారని, వైసీపి అభ్యర్ధులలో 99 శాతం సంపన్నులే అని అందరికీ తెలుసు. అయినా వారి ఆస్తిపాస్తులు అంతంత మాత్రం అని జగన్‌ చెపుతుండటం చూస్తే ఇదో రకం సానుభూతి ప్రయత్నమనిపించక మానదు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -