YS Jagan: ఎన్నికలు కావడంతో జగన్ కు టెస్లా గుర్తొచ్చిందా.. జగన్ మాటలు నమ్మితే మాత్రం కష్టమేనా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ నోటి నుంచి కొత్తకొత్త మాటలు వింటే ప్రజలు ఆశ్చర్యానికి గురువుతున్నారు. అభివృద్ది, డెవలెమ్మెంట్, కంపెనీలు, ఉద్యోగాలు అని ఈ మధ్య అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇదేంటీ జగన్ నోట అభివృద్ది మాట? అని ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు. సీఎం అయిన తర్వాత కూల్చివేతలతోనే పాలన మొదలు పెట్టి.. అరాచకం కొనసాగించారు. ప్రజలు, ప్రతిపక్షాలతో ప్రశంసలు పొందిన ఒక్క నిర్ణయం కూడా వైసీపీ తీసుకోలేదు. అందుకే, జగన్ అభివృద్ది గురించి మాట్లాడితే ఆశ్చర్యం అనిపిస్తుంది.

ఐదేళ్లు పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలతో భేటీలు లేవు. కానీ, ఎన్నికల సమయంలో టెస్లా అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. టెస్లాను ఆహ్వానిస్తున్నట్టు రెండు ఈ మెయిల్స్ పంపామని, కియా ప్లాంట్ సమీపంలో భూమి ఉందని.. ఆ భూమిని టెస్లాకు కేటాయిస్తామని వైసీపీ ప్రచారం చేస్తోంది. త్వరలోనే టెస్లా ఏపీకి వస్తుందని చెబుతున్నారు. ఇదే టెస్లా ప్రతినిధులతో 2017లో లోకేష్ స్వయంగా భేటీ అయ్యి ఏపీకి ఆహ్వానించారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు మెయిల్స్ పంపించామని చెబుతున్నారు. మెయిల్స్ పంపిస్తే.. టెస్లా ఏపీలో ఏర్పాటు అవుతుందా? విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయిని ప్రకటించారు. అందులో ఒక్క కంపెనీ అయినా ఏపీలో ఏర్పాటైందా? ఒక్కరికి అయినా ఉద్యోగం వచ్చిందా? ప్రపంచాన్ని ఆకర్షించే రేంజ్‌లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే ఒక్క కంపెనీ రాలేదు. ఒక్క ఉద్యోగం రాలేదు. రెండు ఈ మెయిల్స్ పెడితే టెస్లా వస్తుందా? టెస్లాను ఇండియాకు తీసుకురావడానికి కేంద్రం ఎన్ని సార్లు రిక్వస్టులు పెడుతుందో తెలియదా? ఇంకా కేంద్రంతో చర్చలు ఓ కొలిక్కి రాలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి రెండు మెయిళ్లు పెడితే టెస్లా కంపెనీ వచ్చేస్తుందా? పైగా ఐదేళ్లుగా లేదని కంపెనీల ఆహ్వానం ఇప్పుడే గుర్తు వచ్చిందా? ఇలాంటి ఎలక్షన్ స్టంట్స్ ను ప్రజలు నమ్ముతారా?

ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత అభివృద్ది అనే డ్రామా మొదలు పెట్టారు. మూడు నెలల క్రితం జగన్ విజన్ విషాఖ పేరుతో గ్రాఫిక్స్ రిలీజ్ చేశారు. విశాఖను ఫారిన్ రేంజ్ లో తయారు చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లు జగన్ కు ఎందుకు గుర్తుకు రాలేదు. అప్పుడు కూడా దానిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. మూడు రాజధానులు అని చెప్పిన జగన్.. ఒక్క నిర్మాణాన్ని కూడా జరపలేదు. విశాఖలో రుషికొండను బోడుగుండుగా మార్చి తన కోసం ఓ ప్యాలస్ కట్టించుకున్నారు. దానిపై విమర్శలు వస్తున్నాయని.. కేంద్రప్రభుత్వ సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు రీసెంట్ గా కలరింగ్ ఇచ్చారు.

ఆగమేఘాల మీద విశాఖలో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభించిననట్టు హడావుడి చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని చూడాలి అని చెప్పింది. అయితే, రిజర్వే బ్యాంక్ నుంచి ఏపీ రాజధాని ఎక్కడ ఉందో చెబితే.. అప్పుడు తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. దీంతో.. ఉన్న పరువు కూడా పోయినట్టు అయింది. నిజానికి టీడీపీ హయాంలో అమరావతి రాజధానిగా ఉన్నపుడు రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి, సిబ్బంది నివాసాలకు ప్రభుత్వం 11 ఎకరాల భూమి కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. దీంతో.. అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు ఆగిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -